Warangal Floods (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Warangal Floods: మీ నిర్లక్ష్యం వల్లే వరదలు.. వరద ముంపు బాధితుల ఆగ్రహం..!

Warangal Floods: హనుమకొండలో వరద ముంపు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. సమయానికి దట్టు గేట్లు ఎత్తకుండ కాలనీలు మునగడానికి కారణం అయిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేస్తూ హనుమకొండ(Hanumakonda)లో తులసి బార్ ముందు మహాధర్నా చేపట్టారు. భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం 100 ఫీట్ల రోడ్డు జంక్షన్ లో మానవహారంగా ఏర్పడ్డ వరద బాధితులు నాలుగు రోడ్లను దిగ్బంధం చేశారు. ఎప్పుడు మునగని కాలనీలు మునిగాయని ఈ పరిస్థితికి కారణం అండర్ డ్రైనేజీ గేట్లు సరైన సమయంలో ఎత్తకపోవడమే అని బాధితులు ఆరోపించారు. గోపాల్పూర్ చెరువు కి రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. ముంపుకు కారణమైన వారిపై తక్షణం చర్య తీసుకోపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామంటూ హెచ్చదించారు.

వరదలు రావడానికి కారణం..

ఈ సందర్భంగా బాధ్యతలు మాట్లాడుతూ గత నెల 30న గోపాలపురం చెరువు నిండి చెరువు కట్ట మీది నుండే మత్తడి పడింది దీనితో చెరువు మొత్తం తెగిపోయిందన్నారు. అధికారుల బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే 56, 57 డివిజన్లలో, వివేక్ నగర్ కాలనీ, ప్రగతినగర్, టీవీ టవర్ కాలనీ, అమరావతి నగర్ కాలనీ, ఎన్జీవోస్ కాలనీ, సమ్మయ్య నగర్ కాలనీలు మొత్తం జలమయమై తీవ్రంగా దెబ్బ తిన్నదనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలనీలన్నీ సర్వం కోల్పోమాయని అసలు వరదలు రావడానికి కారణం మత్తడి నాలాను మూసివేసి భూగర్భ జల సొరంగం నిర్మాణం చేశారన్నారు. సొరంగం గేట్లు ఎత్తివేయడంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ విఫలమైయ్యారని ఆరోపించారు. జీవో ఎంఎస్ 81 లేక్ ప్రొటెక్షన్ కమిటీ చెరువును ప్రతి సంవత్సరము సిల్ట్ అంటే పూటిక తొలగించి గుర్రపు డెక్క తీగ తొలగించి చెరువుల శుభ్రం చేయాలి చెరువుకు ఎఫ్టిఎల్ సరిహద్దులు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. అక్రమ నిర్మాణంలో పేదవారు ఉంటే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని జీవోలో ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన శాఖ స్పష్టం చేసింది. అయినప్పటికీని జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ భూగర్భ జల సొరంగం ప్రాంతాన్ని సందర్శించి గేట్లు ఎత్తివేయాల్సిన అవసరం లేదని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: The Girlfriend collection: రష్మిక మందాన్నా ‘ది గర్ల్ ఫ్రెండ్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా..

చెరువుకు రిటైనింగ్ వాల్..

ఒకవైపు వాతావరణ శాఖ వివిధ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన గ్రేటర్ వరంగల్ అధికులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కలెక్టర్, కమిషనర్ లను బదిలీ చేయవలసిన అవసరం ఉందని వారు అన్నారు. గోపాలపురం చెరువుకు రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని వరదలకు కారణమైన అధికారులపై చర్య తీసుకోవాలని వరద బాధితుల సమాఖ్య డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త తుపాకుల దశరథం, వివేక్ నగర్ కాలనీ అధ్యక్షులు మర్రి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి మీసాల రమేష్, లింగంపల్లి వేణుగోపాలరావు, ప్రగతి నగర్ అధ్యక్షులు బత్తిని సుదర్శన్ గౌడ్, బూర నారాయణ, టీఎన్జీవోస్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, దేవ్ సింగ్, పింగిలి అశోక్ రెడ్డి, శ్యామల దుర్గా దాస్ కాలనీ అధ్యక్షులు నల్లాని శ్రీనివాస్ పాల్గొన్నారు.

Also Read: Ba Ba Black Sheep: మేఘాలయ సీఎంను కలిసిన ‘బా బా బ్లాక్ షీప్‌’ మూవీ టీం..

Just In

01

Jana Nayagan: ‘జన నాయగన్’ కచేరి లిరికల్ వచ్చేసింది.. ‘భగవంత్ కేసరి’ సాంగ్ దించేశారుగా!

KTR: 14 త‌ర్వాత రాష్ట్రంలో పెనుతుపాను.. ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha: ఏదో ఒకటి తేల్చేయవచ్చుగా… ఎందుకీ దాగుడుమూతలు?

Jubilee Hills byPoll: ఉపఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఆంక్షలు.. సజ్జనార్​ ఉత్తర్వులు జారీ

Abhishek Sharma: వరల్డ్ రికార్డ్ సాధించి చరిత్ర నెలకొల్పిన అభిషేక్ శర్మ