Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుపతి జిల్లాలో పర్యటించారు. తొలుత శేషాచలం అడవుల్లోని మామండూరు అటవి ప్రాంతాన్ని పవన్ పరిశీలించారు. అడవి ప్రాంతంలో నాలుగు కిలోమీటర్లకు పైగా పవన్ కాలినడకన ప్రయాణించారు. రెండు కిలోమీటర్ల నడకలో ప్రతి చెట్టునీ పవన్ పరిశీలించారు. అడవిలోని ఎర్రచందనం, అంకుడు, తెల్లమద్ది, వెదురుతో పాటు శేషాచలంలో మాత్రమే కనబడే అరుదైన మొక్కల జాతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అడవిలోని నేపిరయర్ రిజర్వ్ ఫారెస్ట్ వద్దకు చేరుకున్న పవన్.. అక్కడ వాచ్ టవర్ నుంచి మొత్తం అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. వెలిగొండ, శేషాచలం అటవీ సరిహద్దులు, స్వర్ణ ముఖీ నది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది? తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గుంటి మడుగు వాగు ఒడ్డున కూర్చుని.. పరిసరాలను ఆసక్తిగా తిలకించారు. వాగుకి ఇరు వైపులా ఉన్న చెట్ల వివరాలపై ఆరా తీశారు. ఎర్రచందనం స్మగ్లింగ్, స్మగ్లింగ్ నిరోధక ఆపరేషన్స్, టాస్క్ ఫోర్స్, అటవీ సిబ్బంది కూంబింగ్ తదితర తెలుసుకున్నారు. ఎర్రచందన స్మగ్లింగ్ జరగకుండా అన్ని చర్యలు చేపట్టాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
తిరుపతి జిల్లా, మామండూరు అటవీ ప్రాంతాన్ని పరిశీలించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు.
అడవిలో నాలుగు కిలోమీటర్లు పైగా ప్రయాణం. రెండు కిలోమీటర్ల మేర కాలినడకన ప్రతి చెట్టునీ పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ఎర్రచందనం, అంకుడు,… pic.twitter.com/8PB3QNev5j
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2025
— JanaSena Party (@JanaSenaParty) November 8, 2025
Also Read: Ind vs Aus: భారత్-ఆసీస్ మధ్య 5వ టీ20 రద్దు.. సిరీస్ మనదే.. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ఎవరికంటే?
అటవీ పరిశీలన అనంతరం మంగళంలోని అటవీశాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను డిప్యూటీ సీఎం పవన్ పరిశీలించారు. అక్కడ 8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలను అధికారులు పవన్ కు వివరించారు. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడుపోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని అధికారులను పవన్ ఆదేశించారు.
తిరుపతి జిల్లా, మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను శనివారం మధ్యాహ్నం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు పరిశీలించారు.
8 గోడౌన్లలో ఉన్న ఎర్రచందనం లాట్ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడిగి… pic.twitter.com/OPv936UetV— JanaSena Party (@JanaSenaParty) November 8, 2025
