Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో ‘శివ’ వైబ్.. అమల, ఆర్జీవీ ఎంట్రీతో!
Shiva Promotion at Bigg Boss 9 (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Bigg Boss Telugu 9: బిగ్‌బాస్‌లో ‘శివ’ వైబ్.. అమల, ఆర్జీవీ ఎంట్రీతో దద్దరిల్లిన హౌస్!

Bigg Boss Telugu 9: వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 62వ రోజు (Bigg Boss Telugu Season 9 Day 62) శనివారం కింగ్ నాగార్జున (King Nagarjuna) తన ఎంట్రీతోనే ఓ సెలబ్రేషన్ తీసుకొచ్చేశారు. 1989లో కింగ్ నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో వచ్చి సంచలన విజయం సాధించిన ‘శివ’ (Shiva) చిత్ర వైబ్‌లోకి హౌస్‌ని తీసుకెళ్లి, అందరినీ ఎంటర్‌టైన్ చేస్తున్నారు నాగ్. అన్నపూర్ణ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ‘శివ’ చిత్రాన్ని 4K డాల్బీ ఆట్మాస్‌లోకి మార్చి, నవంబర్ 14న థియేటర్లలో గ్రాండ్‌ రీ రిలీజ్‌కు తీసుకొస్తున్న విషయం తెలిసిందే. శనివారం బిగ్ బాస్ హౌస్‌లో ‘శివ’ సంబరాలు జరిగాయి. ‘శివ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమల (Amala), ఆ సినిమాను డైరెక్ట్ చేసిన రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) కూడా బిగ్ బాస్ స్టేజ్‌పై సినిమా ప్రమోషన్ కోసం వచ్చి సందడి చేశారు. అమల, ఆర్జీవీ రాకతో.. బిగ్ బాస్ స్టేజ్ దద్దరిల్లిందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ప్రోమోలో..

Also Read- S Thaman: ‘చికిరి’తో థమన్ శాటిస్ ఫై అయ్యాడా?

ప్రామిస్ చేస్తున్నా..

కింగ్ నాగార్జున ఎంట్రీని ‘శివ’ శ్వాగ్‌తో అదిరిపోయింది. సైకిల్ చైన్ పట్టుకుని ఆయన ఇచ్చిన లుక్ నిజంగానే అప్పటి ‘శివ’ను అందరికీ గుర్తు చేస్తుంది. ఆ వెంటనే ‘బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది’ అంటూ గాళ్స్‌తో కింగ్ డ్యాన్స్ చేస్తుంటే.. ఆయన భార్య, అప్పటి ‘శివ’ హీరోయిన్ అమల కూడా యాడయ్యారు. ఆమె కూడా స్టెప్ కలిపారు. ‘‘36 ఏళ్ల క్రితం మేమిద్దరం ‘శివ’ సినిమాతో మీ ముందుకు వచ్చాం. మళ్లీ ఈ నవంబర్ 14న ఆ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నాం. ఈసారి అవుట్ స్టాడింగ్‌గా సినిమా ఉంటుంది. నేను ప్రామిస్ చేసి చెబుతున్నాను..’’ అని నాగార్జున ఆడియెన్స్‌కు చెప్పారు. వెంటనే హౌస్‌లో ‘శివ’ మ్యూజకల్ కన్సర్ట్ స్టార్టయింది. ‘శివ’ సినిమాలోని పాటకు హౌస్‌లో ఒక్కో జంట డ్యాన్స్ చేస్తున్నారు.

రీతూ, పవన్ డ్యాన్స్‌కు అమల ఫిదా

‘ఆనందం బ్రహ్మా..’ అనే పాటకు తనూజ, కళ్యాణ్ జంట, అలాగే ఇమ్ము, దివ్య జంట డ్యాన్స్ చేయగా.. ‘ఎన్నియల్లో.. మల్లియల్లో.. ఎన్నెన్ని అందాలో’ అనే పాటకు రీతూ, పవన్ డ్యాన్స్ చేస్తున్నారు. రీతూ, పవన్ డ్యాన్స్ చేస్తుంటే అమల కూడా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. వారిద్దరి డ్యాన్స్‌కు ఆమె ముగ్ధురాలయ్యారు. ఆ వెంటనే రీతూ లేచి.. మీలాగే ఎప్పుడూ నవ్వుతూ, సాఫ్ట్‌గా ఉండాలంటే..’ అని అడుగుతుండగా.. కింగ్ నాగ్ ఒక పంచ్ ఇంచారు. అంతే అందరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ వెంటనే సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ. హౌస్‌మేట్స్ అందరం సంతోషంగా ఆయనకు వెల్‌కమ్ పలికారు.

Also Read- Naga Vamsi: నాగవంశీని 2025 భయపెట్టిందా? అందుకే ‘ఫంకీ’ని 2026కు వాయిదా వేశారా?

స్టుపిడ్ క్వశ్చన్

రామ్ గోపాల్ వర్మను రాము రాథోడ్ ఓ ప్రశ్న అడిగారు. ‘పిక్చర్ విడుదలైన తర్వాత ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి మీరు ఎలా ఫీలయ్యారు సార్?’ అని రాము అడిగితే.. ‘చాలా శాడ్‌గా ఫీలయ్యా’ అని వర్మ తనదైన స్టైల్‌లో సమాధానమిచ్చారు. ‘ఎందుకంటే, స్టుపిడ్ క్వశ్చన్ అది’ అని చెప్పారు. ‘రాములో రాము బయటకు వచ్చాడు’ అని కింగ్ ఇంకాస్త కామెడీని జోడించారు. ‘నిన్ను బిగ్ బాస్ హౌస్‌లో 100 రోజులు ఉండమంటే ఉంటావా?’ అని ఆర్జీవీని నాగ్ ప్రశ్నించారు. ‘అందరూ సంజనా లాంటి అందమైన అమ్మాయిలు ఉంటే మాత్రం ఉంటాను’ అని రాము మరోసారి తన అమ్మాయిల పిచ్చిని ప్రదర్శించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Wife Extramarital affair: పెళ్లైన 4 నెలలకే బయటపడ్డ భార్య ఎఫైర్.. ఫ్లెక్సీ వేయించి భర్త న్యాయపోరాటం!

Galaxy Watch: గెలాక్సీ వాచ్ వినియోగదారులకు శుభవార్త..

Pawan Kalyan: పవన్ ఖాతాలో మరో ఘనత.. ఏపీకి జాతీయ స్థాయిలో నెంబర్ 1 ర్యాంక్

Tollywood Flops: 2025లో నిర్మాతలను నిండా ముంచేసిన టాలీవుడ్ టాప్ టెన్ సినిమాలు ఇవే?..

Maoist Encounter: భారీ ఎన్ కౌంటర్.. టాప్ తెలుగు మావోయిస్టు నేత హతం