Chikiri song record: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’. ఈ చిత్రం నుంచి విడుదలైన తొలి పాట “చికిరి చికిరి” ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టిస్తోంది. ఈ మాస్ నంబర్ కేవలం వ్యూస్ పరంగానే కాక, అత్యంత వేగంగా రికార్డులను బద్దలు కొట్టడంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక్క పాటతో నే ఇన్ని రికార్డులు మద్దల గొడితే రానున్న రోజుల్లో మరెన్ని రికార్డులు నెలకొల్పుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతే కాకుండా 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 46 మిలియన్లు వ్యూస్ సాధించింది. ఇది భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా రికార్డుకెక్కింది. దీంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
తెలుగు సినిమా పాటల చరిత్రలో అప్పటివరకు రికార్డుగా నిలిచిన అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రంలోని “కిసిక్” సాంగ్‌ను ‘చికిరి చికిరి’ కేవలం సగం సమయంలోనే అధిగమించడం విశేషం. ‘పుష్ప 2’ కిసిక్ సాంగ్ 24 గంటల్లో సాధించిన 17.1 మిలియన్లకు పైగా వ్యూస్ రికార్డును సాధించింది. అయితే ‘పెద్ది’లోని “చికిరి చికిరి” పాట కేవలం 14 గంటల్లోనే ఈ రికార్డును దాటేసింది. ఈ మైలురాయిని చేరుకోవడంలో ‘చికిరి చికిరి’ చూపించిన వేగం చూస్తే, రామ్ చరణ్ సినిమాకు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఇది తెలుగు సినిమా చరిత్రలోనే ఒక పాట అత్యంత వేగంగా అత్యధిక వ్యూస్ సాధించిన ఆల్-టైమ్ రికార్డుగా నిలిచింది.
Read also-The Girlfriend: ఆ రీల్ చూసి ఎమోషన్ అయిన రాహుల్ రవీంద్రన్.. ఈ సినిమా ఒక్కటి చాలు..
‘చికిరి చికిరి’ పాట ఈ అద్భుతమైన రికార్డును నెలకొల్పడానికి కొన్ని అంశాలు దోహదపడ్డాయి అవి ఏంటంటే.. ఈ పాటలో రామ్ చరణ్ నెక్స్ట్ లెవెల్ డ్యాన్స్, గ్రేస్, ఎనర్జీని చూపించారు. ముఖ్యంగా పాటలో ఆయన వేసిన ఊర మాస్ స్టెప్పులు, అభిమానులకు పండగ వాతావరణాన్ని అందించాయి. ‘చిరుత’ సినిమా నాటి చరణ్ ఎనర్జీని గుర్తు చేసేలా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన మాస్ బీట్, పాటను ఒక లెవెల్‌కి తీసుకెళ్లింది. వినగానే డ్యాన్స్ చేయాలనిపించే మాస్ కంపోజిషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ‘రంగస్థలం’ తర్వాత మరో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న రామ్ చరణ్ సినిమా కావడం, బుచ్చిబాబు లాంటి దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జాన్వీ కపూర్ గ్లామర్ కూడా ఈ పాటకు మరింత హైప్‌ను ఇచ్చింది. మొత్తం మీద ‘పెద్ది’ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి” కేవలం పాటగానే కాకుండా, రికార్డుల విషయంలోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ రికార్డుల పరంపర సినిమా విడుదలకు ముందు ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
MOST VIEWED SONG IN INDIAN CINEMA – #ChikiriChikiri🔥🔥
Mega Power Star @AlwaysRamCharan – @BuchiBabuSana – @arrahman ❤️🔥
This trio has set a NEW RECORD IN INDIAN CINEMA 💥💥#Peddi First Single #ChikiriChikiri is a sensation all over ❤️🔥
▶️ https://t.co/ljpLVy0noC#PEDDI… pic.twitter.com/Nn5b1v0uwU— Sukumar Writings (@SukumarWritings) November 8, 2025
