Kishan Reddy ( image credit: swetcha reporter)
Politics

Kishan Reddy: కాంగ్రెస్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపాటు

Kishan Reddy: కాంగ్రెస్ సర్కార్ అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నదని, ఫ్యూచర్ సిటీ పేరిట డ్రామాలు ఆడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ, హైమావతి నగర్ చౌరస్తాలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మెట్రో ఫేజ్ 2ను తాను అడ్డుకున్నట్లు కాంగ్రెస్ విమర్శిస్తోందని, అవి పచ్చి అబద్ధాలని కిషన్ రెడ్డి ఖండించారు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలు చాలా కీలకమని, ఈ స్థానం నుంచి గతంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు గెలిచినా, జూబ్లీహిల్స్ పరిస్థితి మాత్రం మారలేదన్నారు.

Also Read: Kishan Reddy: ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నా: కిషన్ రెడ్డి

బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది మూసీలో వేసినట్టే

ఈ పరిస్థితి మారాలంటే బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. కేసీఆర్ హైదరాబాద్‌ను సింగపూర్, ఇస్తాంబుల్‌గా మారుస్తానని కబుర్లు చెప్పారని, కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అభివృద్ధి కూడా ఇక్కడ జరగలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే అది మూసీలో వేసినట్టేనని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ హిందువులంటే లెక్క లేనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. మజ్లీస్ రౌడీరాజ్యాన్ని ఎదుర్కోవాలంటే, జూబ్లీహిల్స్‌లో ఉన్న 4 లక్షల మంది ఓటర్లు ఏకమై బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు.

సిగ్గు చేటు.

‘సోమాజిగూడలోని హోటల్ కత్రియలో జరిగిన ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడారు. వందేమాతరం పాడడాన్ని మజ్లిస్ వ్యతిరేకిస్తోందని, వందేమాతరం, భారత్ మాతా కీ జై నినాదాలు ఇవ్వడానికి కూడా ఇష్టపడదన్నారు. కానీ పార్లమెంట్‌లో ఎంపీ అసదుద్దీన్ ‘ఖలిస్తాన్ జిందాబాద్’ అని నినాదం చేస్తారని ధ్వజమెత్తారు. దీనిని కాంగ్రెస్ ఇప్పటికీ ఖండించలేదని, ఇది ఇంకా సిగ్గుచేటని రాంచందర్ విమర్శించారు. కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని అంటున్నారని, మరి హిందువులు ఎక్కడికి పోవాలి? అని ఆయన ప్రశ్నించారు. దేశం నలుమూలల నుంచి వచ్చి జూబ్లీహిల్స్‌లో స్థిరపడిన వారంతా బీజేపీకి ఓట్లేసి గెలిపించాలని రాంచందర్ కోరారు.

Also Read: Kishan Reddy: సింగరేణికి సర్కార్ రూ.42 కోట్లు పెండింగ్.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Just In

01

Anupama Parameswaran: అనుపమపై అసభ్యకర పోస్ట్‌లు పెట్టిన వ్యక్తిని పట్టేశారట!

Sreeleela: శ్రీలీల సపోర్ట్‌‌తో.. ప్రియదర్శి, ఆనందిల ‘పెళ్లి షురూ’

Janhvi Kapoor: మళ్లీ అందాలేనా? ఈసారైనా పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తుందా?

Shiva Re Release: జెన్-జి‌ని మెప్పించే కంటెంట్‌ ‘శివ’లో ఏముంది? ఎందుకు ఈ సినిమా చూడాలి?

Andhra King Taluka: ‘ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ అప్డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?