Harish Rao (image credit: swetcha reporter)
Politics

Harish Rao: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం రాబోతుంది.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: జూబ్లీహిల్స్ ఎన్నిక నాలుగు లక్షల మంది ప్రజల భవిష్యత్తు కాదు. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పాలని, ఈ తీర్పు రాష్ట్ర ప్రజలకు మేలు చేకూర్చాలని అందరూ ఎదురుచూస్తున్నారన్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీట్ ద ప్రెస్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. రాష్ట్రంలో నలుగురు రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని ఆరోపించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలన అరాచకాలకు జూబ్లీహిల్స్ ప్రజలు చరమగీతం పాడనున్నారన్నారు.

Also Read: Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

1900 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వలేదు 

కేసీఆర్ పాలనలో వికాసం, రేవంత్ పాలనలో విధ్వంసం అని ధ్వజమెత్తారు. ప్రజలు వికాసం కావాలా, వినాశనం కావాలా ఆలోచించాలని కోరారు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అంటే, కాలేజీల మీద విజిలెన్స్ దాడులు, పోలీసుల దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 19,500 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించిందని, రెండేళ్లలో రేవంత్ రెండు రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల గాక కాలేజీలు బందు పెట్టారని, ఆ పిల్లలు జూబ్లీహిల్స్ లో కూడా ఉన్నారన్నారు. ఆరోగ్య శ్రీ వైఎస్ఆర్ తెచ్చిన పథకం అని గొప్పలు చెప్పడం కాదు, పథకం అమలు చేయడం లేదు, ఆసుపత్రులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 1900 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

6వేల డబుల్ ఇల్లు కడతాం

రాష్ట్రంలో 11 పెద్ద ప్రాజెక్టులు 13 వేల కోట్ల విలువైనవి చెరువుల్లో నిర్మిస్తున్నారని ఆపాలని నాడు భట్టి అన్నారని, ఇప్పుడు భట్టి ప్రెస్ మీట్, సీఎం సెటిల్మెంట్ అని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు.. దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. చివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. చేసింది చెప్పుకునేది లేక జూబ్లీహిల్స్ లో నాయకులు ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. చివరకు ప్రజలను పథకాలు ఆగిపోతాయి అని బెదిరిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకున్నదని, ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావు లేదన్నారు. కంటోన్మెంట్ ఉన్న ఎన్నికల్లో 6వేల డబుల్ ఇల్లు కడతామని, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని, డిఫెన్స్ లాండ్ రెగ్యులరైజేషన్ అన్నారని, ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు.

60 శాతం క్రైమ్‌ రేటు పెరిగింది

రెండేళ్లలో ఎందుకు మైనార్టీ మంత్రి పదవి ఇవ్వలేదు. ఎందుకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వలేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతును గెలిపించాలని, మూసీ, హైడ్రా పేరిట ఇల్లు కూల్చితే నిలబడ్డది బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. పోలీసులకు జీతాలు, బెన్ఫిట్స్ ఇవ్వకుండా వారికి నరకం చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం, ఒక్క క్రైంలో మాత్రమే పురోగమనం అని దుయ్యబట్టారు. మహిళల పట్ల జరుగుతున్న నేరాల శాతం 12.3 % పెరిగాయని, గడిచిన ఏడాదితో పోల్చితే అత్యాచారాలు 28శాతం,కిడ్నాపులు 26శాతం, ఇప్పుడు సైబరాబాద్‌లో 41 శాతం, హైదరాబాద్‌లో 60 శాతం క్రైమ్‌ రేటు పెరిగిందన్నారు. తెలంగాణలో 22శాతం క్రైం రేటు పెరిగినట్లు పోలీసు యాన్యువల్ రిపోర్టే స్పష్టం చేసిందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదు

కాంగ్రెస్ పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయని మండిపడ్డారు. రియల్ ఎస్టేట్ ఢమాల్ అయిందన్నారు. మంత్రులకు  కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం లేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఇవ్వదు, కాంగ్రెస్ కోట్లడదు అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పోరాటంతోనే రైతు బంధు వచ్చిందన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బీజేపీ కలిసి మోసం చేశాయన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయన్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ పార్లమెంట్ లో ప్రశ్న అడిగితే 2.80 లక్షల కోట్లు మాత్రమే బీఆర్ఎస్ అప్పు అని చెప్పిందని, కానీ రెండేళ్లలో రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల అప్పు కాంగ్రెస్ చేసిందన్నారు.

అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుంది

ఢీల్లీకి మూటలు మోయడం తప్ప కాంగ్రెస్ చేసిందేమీలేదన్నారు. మీరు ఓటర్లు కాదు న్యాయ నిర్ణేతలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి..ఆత్మ సాక్షిగా ఓటు వేయాలన్నారు. రెండే టీంలు ఉన్నాయి.. ఒకటి ఆరు గ్యారెంటెలు ఎగ్గొడుతున్న టీమ్ ఒకటి, అమలు చేయాలని పోరాడుతున్న టీం అన్నారు. ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు ఓటు వేయాలి.. సునితకు ఓటు వేయాలి. రాష్ట్ర ప్రగతికి దోహదం చేయాలన్నారు. అన్ని సర్వేలు బీఆర్ ఎస్ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయన్నారు. సైలెంట్ వేవ్ రాబోతున్నది జూబ్లీహిల్స్ ఎన్నికల్లో
నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని, బీఆర్ఎస్ ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Harish Rao: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.. సీఎంకు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ

Just In

01

VVPAT Slips: షాకింగ్.. బీహార్‌లో రోడ్డు మీద కుప్పలుగా వీవీప్యాట్ స్లిప్పులు

Kunamneni Sambasiva Rao: ఆ రెండు పార్టీలు గెలిస్తే చాలా డేంజర్: ఎమ్మెల్యే కూనంనేని

Mana Shankara Vara Prasad Garu: వైరల్‌ సెన్సేషన్‌.. మరో బెంచ్‌మార్క్‌కు చేరుకున్న ‘మీసాల పిల్ల’!

KTR Resign Posters: కేటీఆర్ రాజీనామా!.. జూబ్లీహిల్స్‌లో పోస్టర్ల కలకలం

Warangal Floods: మీ నిర్లక్ష్యం వల్లే వరదలు.. వరద ముంపు బాధితుల ఆగ్రహం..!