Worldcup Stage 3 Indian Compound Womens Team Achieves Hattrick Of Goldmedals: వరల్డ్ కప్ ఆర్చరీ స్టేజ్ ౩లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో భారత్ ఎస్తోనియాపై విజయం సాధించింది. ఏపీకి చెందిన అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అదితి గోపీచంద్ స్వామి, పర్నిత్ కౌర్ ఈ జట్టులో సభ్యులుగా ఉన్నారు. తుదిపోరులో 4 ఎండ్‌లలో భారత్ వరుసగా 4 పాయింట్లు సాధించింది.
ఎస్తోనియా టీమ్ సభ్యులు వరుసగా 4 స్కోర్లు చేసి 3 పాయింట్లతో వెనుకంజలో ఉన్నారు. మన మహిళల జట్టు ఈ ఏడాది వరుసగా మూడో వరల్డ్ కప్‌లోనూ పసిడి పతకం గెలుచుకొని సత్తా చాటారు. ఇక మరోవైపు పురుషుల కాంపౌండ్ విభాగం ఫైనల్‌లో పురుషుల విభాగంలో సైతం భారత్ ఆధిపత్యమే కొనసాగింది. అభిషేక్ వర్మ, ప్రియాంశు, ప్రథమేశ్ ఫ్యూజీలతో కూడిన భారత జట్టు 7 పాయింట్ల తేడాతో ఆ టీమ్‌ని మట్టి కరిపించి నెదర్లాండ్స్‌ను అధిగమించింది.