T20 World Cup 2024 Afghanistan Vs Newzealand 14th Match Group: టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాకి పసికూన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. ఎస్టీ విన్‌సెంట్ వేదికగా ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్‌ని ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 148 రన్స్ చేసింది.
అనంతరం 149 రన్స్ లక్ష్యంతో చేజింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా బ్యాటర్లను ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు తగ్గేదేలే అంటూ ఓ ఆట ఆడుకున్నారు. మ్యాక్స్‌వెల్ మినహా ఏ బ్యాటర్‌ను కూడా క్రీజ్‌లో నిలవకుండా ఔట్ చేశారు. దీంతో ఆఫ్ఘాన్ కేవలం 149 పరుగులను కాపాడుకొని ఆస్ట్రేలియా జట్టుపై 21 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ సెమీస్ రేసులో మేము కూడా బరిలో ఉన్నామని ఆస్ట్రేలియా టీమ్‌కి సవాల్ విసిరింది. అలాగే ఆస్ట్రేలియా సెమీస్ ఆశలను ఆఫ్ఘన్ క్లిష్టతరం చేసింది. ఇదిలా ఉంటే వన్డే వరల్డ్ కప్ సెమిస్ మ్యాచులో ఆఫ్ఘాన్‌ను ఓడించినందుకు ఆ జట్టు ఈ మ్యాచులో పగ తీర్చుకున్నారు.