Kurnool Bus Accident: కర్నూలు జరిగిన ఘోర బస్సు ప్రమాద ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ (Vemuri Kaveri Travells) స్లీపర్ బస్సు గత నెల 24న ప్రమాదానికి గురైంది. బస్సులో మంటలు చెలరేగి.. 19 మంది సజీవ దహనమయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే దీనిపై ఏపీ పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ట్రావెల్స్ యజమాని అరెస్ట్..
వి.కావేరి బస్సు ప్రమాదం నేపథ్యంలో డ్రైవర్ లక్ష్మయ్యను ఏ1గా చేర్చిన కర్నూలు పోలీసులు.. ఇప్పటికే అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఏ2గా ఉన్న ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్ కుమార్.. ప్రమాదం జరిగిన తర్వాత నుంచి కనిపించకుండా పోయారు. దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తూ వచ్చారు. తాజాగా ఆయన్ను కర్నూలు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వెంటనే స్పెషల్ మెుబైల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
ఓ ద్విచక్ర వాహనం కారణంగా ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో ఉన్న శివశంకర్, ఎర్రిస్వామి అనే ఇద్దరు స్నేహితులు బైక్ మీద వెళ్లి.. డివైడర్ ను ఢీకొట్టారు. దీంతో బైక్ ను నడుపుతున్న శివ శంకర్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలతో బయటపడ్డ ఎర్రిస్వామి.. రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ ను తీయాలని భావించాడు. ఈ లోపే వి. కావేరి ట్రావెల్స్ బస్సు బైక్ ను ఢీకొట్టి 300 మీటర్ల వరకూ ఈడ్చుకెళ్లింది. దీంతో బైక్ నుంచి నిప్పు రవ్వలు చెలరేగి అవి బస్సుకు అంటుకున్నాయి. ఫలితంగా క్షణాల వ్యవధిలో బస్సులో మంటలు చెలరేగాయి. పలువురు ప్రయాణికులు కిటికీ అద్దాలు బద్దలు కొట్టుకొని బయటపడగా.. 19 మంది బస్సులోనే చిక్కుకుపోయి సజీవ దహనమయ్యారు.
Also Read: Jatadhara review: ‘జటాధర’గా సుధీర్ బాబు మెప్పించాడా.. లేదా ఆత్మలకు బలయ్యాడా?.. తెలియాలంటే..
బైకర్ వీడియో వైరల్
కర్నూలు బస్సు ప్రమాదానికి ముందు బైకర్ శివ శంకర్ కు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అర్ధరాత్రి 2.20 గంటల సమయంలో శివ శంకర్, అతడి స్నేహితుడు ఎర్రిస్వామి ఓ పెట్రోల్ బ్యాంక్ కు వచ్చారు. ఈ క్రమంలో శివ శంకర్ ప్రవర్తన మద్యం సేవించిన వారి లెక్క కనిపించింది. తడబడుతున్నట్లు ఉండటం.. బైక్ ను ర్యాష్ గా ముందుకు పోనివ్వడం.. ఈ క్రమంలో బండి కాస్త స్కిడ్ కావడం సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. దీంతో అతడు శివ శంకర్ మద్యం సేవించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులో బైకర్ శివశంకర్.. సీసీటీవీ దృశ్యాలు#KurnoolBusIncident #Kurnool #Sivashankar #APNews #AndhraPradesh pic.twitter.com/RR7HRHczNt
— Swetcha Daily News (@SwetchaNews) October 25, 2025
