Maganti Family Issue: జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ (Maganti Gopinath) కుటుంబంలో చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మాగంటి గోపినాథ్ తల్లి మహానంద కుమారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి రెండో భార్య సునీత నిర్లక్ష్యం వల్లే తన బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని విమర్శించారు. తన బిడ్డ మరణించిన విషయాన్ని కూడా తనకు వెంటనే చెప్పలేదని ఆమె ఆరోపించారు. కొడుకును చూసుకునేందుకు వెళ్తే తమను కొట్టించడానికి సునీత ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కేటీఆర్.. పట్టించుకోలేదు’
మాగంటి గోపినాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఓ రోజు కేటీఆర్ అక్కడకు వచ్చారని తల్లి మహానంద కుమారి (Mahananda Kumari) గుర్తుచేశారు. తామిద్దరం ఒకే లిఫ్ట్ లో ప్రయాణించామని అన్నారు. తన బిడ్డను చూడనివ్వట్లేదని కేటీఆర్ తో చెప్పబోతుండగా మళ్లీ వచ్చి మాట్లాడతానని చెప్పి మాగంటి వద్దకు ఆయన వెళ్లారని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటి తర్వాత తాను నిలబడి ఉన్న వైపు నుంచి కాకుండా రెండో డోర్ నుంచి కేటీఆర్ హడావిడీగా వెళ్లిపోవడం గమనించానని అన్నారు. మాగంటి సునీత వల్ల తనకు ఎదురవుతున్న సమస్యను చెప్పుకునేందుకు కేటీఆర్ వెంటపడ్డానని తెలిపారు. కారు వరకూ వెంటపడుతూ వెళ్లినప్పటికీ కేటీఆర్ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు.
‘నన్ను కొట్టించాలని చూసింది’
అంతకుముందు కేటీఆర్ వస్తున్నారన తెలిసి ఆస్పత్రికి వెళ్తే తనను సునీత కొట్టించాలని చూసిందని తల్లి మహానంద కుమారి ఆరోపించారు. ఇందుకోసం ఆస్పత్రి వద్ద కొంతమంది కుర్రాళ్లను మోహరించినట్లు ఆమె పేర్కొన్నారు. కానీ దాడి చేసే విషయంలో వారి భయపడి వెనక్కితగ్గారని చెప్పారు. తాను చెప్పేది అబద్దం కాదని.. అవసరమైతే నిరూపిస్తానని కూడా మహానంద కుమారి వెల్లడించారు.
సునీత నిర్లక్ష్యం వల్లే..
మాగంటి గోపినాథ్ మృతికి సునీత నిర్లక్ష్యమే కారణమని తల్లి మహానంద కుమారి ఆరోపించారు. ఒక కిడ్నీ లేకుండా డయాలసిస్ సమస్యతో బాధపడుతున్న తన బిడ్డను చూసుకునేందుకు కనీసం ఒక వ్యక్తిగత నర్స్ ను కూడా ఆమె పెట్టలేదని మండిపడ్డారు. పూర్తిగా కోలుకునేవరకైనా ఆస్పత్రిలో ఉంచాలి కదా? అని ప్రశ్నించారు. తన బిడ్డను కాపాడుకునేందుకు సునీత ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మాగంటి గన్ మెన్ లను సైతం పక్కన ఉండనివ్వలేదని అన్నారు.
Also Read: Maganti Family Dispute: మాగంటి అసలైన వారసుడ్ని నేనే.. నా ప్రాణాలకు ముప్పు ఉంది.. ప్రద్యుమ్న తారక్
‘కేటీఆర్ సమాధానం చెప్పాలి’
ఆస్పత్రిలో గోపీనాథ్‌కు జరుగుతున్న చికిత్స వివరాలను బహిర్గతం చేయలేదని తల్లి మహానంద కుమారి అన్నారు. 92 ఏళ్ల వయసులో తనకు ఏంటీ క్షోభ అని ప్రశ్నించారు. గోపీనాథ్ మరణం ఒక మిస్టరీ అని అనుమానం వ్యక్తం చేశారు. అసలు తన కుమారుడు చనిపోయినా కూడా వెంటిలేటర్‌పై పెట్టారా? కేటీఆర్ వచ్చి వెళ్లిన తరువాత గోపీనాథ్ చనిపోయినట్టు ఎందుకు ప్రకటించారు? అన్నది తెలియాలన్నారు. దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
బిగ్ టీవీతో మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి..
ఆసుపత్రిలో నన్ను చూసి కేటీఆర్ వెనుక వైపు నుంచి వెళ్లిపోయారు
నా బిడ్డ ఉన్నాడో లేదో తెలియక దిక్కుతోచని స్థితిలో కేటీఆర్ వెంటపడ్డా పట్టించుకోలేదు
మేము వస్తే కొట్టించాలని సునీత ప్రయత్నం చేసింది
మాగంటి గోపీనాథ్ మృతి విషయం మాకు… pic.twitter.com/snM2CqbWAf
— BIG TV Breaking News (@bigtvtelugu) November 7, 2025
