Balakrishna Akhanda 2 (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Akhanda 2: నందమూరి నటసింహం బాలకృష్ణ (Natasimham Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సునామీ ఖాయమని ఫిక్సయిపోవచ్చు. వీరి సూపర్ హిట్ కాంబోలో రాబోతున్న నాల్గవ చిత్రం, పాన్ ఇండియా మూవీ ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thandavam) పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, మేకర్స్ డిసెంబర్ 5న సినిమాను విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ, విడుదల తేదీ దగ్గరపడుతున్నా ప్రమోషన్స్ విషయంలో నెలకొన్న అనుమానాలు, నిదానం.. అభిమానులను, ట్రేడ్ వర్గాలను కలవరపెడుతున్నాయి.

Also Read- Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!

నెల రోజులే గడువు.. ప్రచారంలో దూకుడేది?

డిసెంబర్ 5వ తేదీకి కేవలం నెలరోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. సాధారణంగా ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమా (Pan Indian Movie)కు, ముఖ్యంగా బాలీవుడ్, ఇతర దక్షిణాది భాషల్లో మార్కెట్ చేయాలనుకున్నప్పుడు, కనీసం రెండు నెలల ముందు నుంచే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టాలి. ‘అఖండ 2’ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నప్పుడు ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ప్రత్యేక ప్రెస్ మీట్‌లు, ఈవెంట్‌లు నిర్వహించడం తప్పనిసరి. కానీ, ఇప్పటి వరకు టైటిల్ లోగో తప్ప, చిన్న టీజర్ తప్ప వేరే ఏమీ వదలలేదు. ఇప్పుడో పాట వదిలేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ చూస్తే.. ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బాలయ్య, బోయపాటి షూటింగ్‌ నుంచి వస్తున్న వీడియోలు దర్శనమివడంతో.. ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తవలేదా అనే సందేహాలు మొదలయ్యాయి. ఒకవేళ షూటింగ్ పూర్తయినా, వీఎఫ్‌ఎక్స్, పోస్ట్-ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుంది. ఇన్ని పనులు మిగిలి ఉండగా, డిసెంబర్ 5న రిలీజ్ సాధ్యమేనా అనే చర్చ మొదలైంది.

Also Read- Rashmika Mandanna: నన్ను కలవాలంటే ‘రౌడీ జిమ్’కు వచ్చేయండి.. నేనే ట్రైన్ చేస్తా!

ఫ్యాన్స్ టెన్షన్.. రిలీజ్ డేట్ మారుతుందా?

ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ వ్యవహారంపై తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. బాలయ్య కెరీర్‌లోనే ‘అఖండ’ ఒక మైలురాయి చిత్రం. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘అఖండ 2’ విషయంలో మేకర్స్ ఇంత అలసత్వం వహించడం సరైనది కాదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ అంటే, కనీసం నవంబర్ మొదటి వారంలో గుర్తుండిపోయేలా, అంచనాలు పెంచేలా స్ట్రాంగ్ కంటెంట్ వదలాలి. అసలు ప్రమోషన్స్ మొదలుపెట్టకపోతే పాన్ ఇండియాలో ఎలా మార్కెట్ అవుతుంది? అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే, సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో దీనిపై మేకర్స్ నుండి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. ఒకవేళ తేదీ మారితే, పాన్ ఇండియా రిలీజ్ ప్లానింగ్‌లో ఎలాంటి మార్పులు చేస్తారోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Akhanda 2: బాలయ్య పాన్ ఇండియా ప్రచారంలో దూకుడేది.. ఇంకా అనుమానాలేనా?

Parasakthi: శ్రీలీలతో రెట్రో రొమాన్స్‌లో శివకార్తికేయన్‌.. ‘పరాశక్తి’ సాంగ్ అదిరింది

Ram Mohan Naidu: 52 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కేంద్రమంత్రి రామ్మోహన్ భేటీ.. ఎందుకంటే?

Rana Daggubati: కాలాన్ని రీ క్రియేట్ చేయగలిగేది ఒక్క సినిమా మాత్రమే!

Rukmini Vasanth: ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు ఇలాంటి చిత్రం రాలేదు.. ‘టాక్సిక్’పై రుక్మిణి వసంత్!