Leopard Attack: చిరుత కలకలం.. కాపుకాసి లేగదూడపై దాడి
Leopard Attack (Image Source: AI)
ఆంధ్రప్రదేశ్

Leopard Attack: చిరుత కలకలం.. కాపుకాసి లేగదూడపై దాడి.. భయం గుప్పిట్లో గ్రామస్తులు

Leopard Attack: చిత్తూరులో చిరుత దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఐరాల మండలం వడ్రంపల్లి గ్రామంలో ఓ లేగదూడపై దాడి చేసి చిరుత చంపేసింది. చిరుత దాడిలో లేగదూడను కోల్పోయినట్లు రైతు ఎం. కిషోర్ వాపోయారు. మేత కోసమని దూడను పొలంకు తీసుకెళ్లిన కిషోర్.. ఓ పనిమీద ఇంటికి వస్తూ దూడను అక్కడే కట్టేశాడు. తిరిగి పొలం వద్దకు వెళ్లేసరికి దూడ నిర్జీవంగా రక్తపుమడుగులో పడి ఉంది. ఒంటి మీద పులి దాడి చేసినట్లుగా గుర్తులు కనిపించాయి.

దీంతో దాడి విషయాన్ని అటవీశాఖ అధికారుల దృష్టికి ఎం. కిషోర్ తీసుకెళ్లాడు. దీంతో హుటాహుటీన అక్కడకు చేరుకున్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కరణ్, వెటర్నరీ డాక్టర్ శిరీష.. రక్తపు మడుగులో ఉన్న లేగదూడను పరిశీలించారు. దాని ఒంటిపై ఉన్న గాయాలను డాక్టర్ శిరీష క్షుణ్ణంగా పరిశీలించారు. మెడ, పొట్ట భాగాల్లో అయిన గాయాల తీవ్రతను బట్టి అది చిరుత దాడి చేసినట్లు ఆమె ప్రాథమికంగా నిర్ధారించారు.

Also Read: Duvvada Couple: దువ్వాడ జంట మంచి మనసు.. కాశీబుగ్గ బాధితులకు ఆర్థిక సాయం.. మేమున్నామంటూ భరోసా!

లేగ దూడతో పాటు చుట్టుపక్కల పొలాలు పరిశీలించిన అనంతరం అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. లేగ దూడపై దాడి చేసిన మృగం చిరుతేనని తేల్చారు. చిరుత పంజా ముద్రలు, కాలి గుర్తులు పొలంలో తమకు కనిపించాయని అన్నారు. కాబట్టి చిరుతను దూరంగా పంపేవారకు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రాత్రివేళ ఎవరూ ఒంటరిగా పొలాలవైపునకు రావద్దని సూచించారు. చనిపోయిన లేగదూడకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ తరపున నష్టపరిహారాన్ని అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

Also Read: Jagan Padayatra 2.O: మళ్లీ పాదయాత్ర చేయబోతున్న వైఎస్ జగన్.. 2017-18 మాదిరిగా గేమ్ ఛేంజర్ అవుతుందా?

Just In

01

KP Vivekanand: పాలమూరు ప్రాజెక్టుకు రెండేళ్లలో ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద!

Operation Sindoor 2.O: పాకిస్థాన్‌‌లో ‘ఆపరేషన్ సింధూర్ 2.O’ భయాలు.. సరిహద్దులో కీలక పరిణామం

Phone Tapping Case: నేడు సాయంత్రం సీపీతో సమావేశం కానున్న సిట్ బృందం!

KTR on CM Revanth: మా అయ్య మెుగోడు.. తెలంగాణ తెచ్చినోడు.. సీఎంకు కేటీఆర్ కౌంటర్

Band Sanjay: మంత్రుల బాగోతమంతా త్వరలో బయటపెడతాం: బండి సంజయ్!