Bigg Boss Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వారానికి సంబంధించి కెప్టెన్సీ కంటెండర్ షిప్ టాస్కులను బిగ్ బాస్ టీమ్ డిఫరెంట్ గా ప్లాన్ చేసింది. ఇంటి సభ్యుల్లో కొందరిని రెబెల్స్ ను చేస్తూ టాస్కులను రసవత్తరంగా మారుస్తోంది. ఈ వారం హౌస్ లో ఒక ఫోన్ ను ఏర్పాటు చేసిన బిగ్ బాస్.. దాని ద్వారా ఒక్కో కంటెస్టెంట్ తో మాట్లాడుతూ సీక్రెట్ టాస్కులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఎపిసోడ్ లో రీతూకు కాల్ చేసిన బిగ్ బాస్.. ఒక సీక్రెట్ మిషన్ అప్పగించారు. ఇందులో భాగంగా ఇమ్మాన్యుయేల్, రీతూ మధ్య బిగ్ ఫైట్ జరగడాన్ని తాజాగా విడుదల చేసిన ప్రోమోలో చూడవచ్చు.
ప్రోమోలో ఏముందంటే?
ప్రోమో ప్రారంభంలో హౌస్ లోని ఫోన్ రింగ్ అవుతుంది. అప్పుడు రీతూ పరిగెత్తుకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు కొత్త రెబల్ అని ప్రకటిస్తారు. ఇందులో భాగంగా ఆమెకు మెుదటి సీక్రెట్ టాస్క్ ఇవ్వడాన్ని ప్రోమోలో చూడవచ్చు. సీక్రెట్ టాస్క్ లో భాగంగా ఇంట్లోని ఒకరితో సీరియస్ గా గొడవ పడాలని రీతూను బిగ్ బాస్ ఆదేశిస్తారు.
ఇమ్మూతో రీతూ గొడవ..
బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్ ను పూర్తి చేసేందుకు ఇమ్మాన్యుయేల్ ను రీతూ ఎంచుకోవడాన్ని ప్రోమోలో చూడవచ్చు. ‘మీరు పవన్ ను తీయకుండా ఉండుంటే మాకు టాస్క్ ఆడటం ఈజీ అయ్యేది’ అని ఇమ్మాన్యుయేల్ తో రీతూ అంటుంది. అది గేమ్ అని ఇమ్మూ అనగా.. ఆటలో వెన్నుపోటు పొడిచేస్తారా అని రీతూ ప్రశ్నిస్తుంది. నేనొక్కడిని ఓటు వేయడం వల్ల పవన్ గేమ్ నుంచి ఎలిమినేట్ కాలేదని రీతూతో ఇమ్ము అంటాడు. మీ టీమ్ ఎలిమినేట్ చేసింది కాబట్టి మీతోనే తనకు సంబంధం అని చెబుతుంది. ఇలా ఇమ్ము – రీతూ మధ్య గొడవ ఓ రేంజ్ లో జరిగినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతోంది.
Also Read: Hyderabad Crime: ట్రాన్స్ జెండర్ కోసం.. ఫ్రెండ్స్ మధ్య గొడవ.. కత్తులతో పొడిచి యువకుడి హత్య
మరో ఆసక్తిర టాస్క్
రెబెల్స్ చేసే ఎలిమినేషన్ నుంచి రక్షణ కల్పించే సెఫ్టీ కార్డ్ కోసం బిగ్ బాస్ మరో టాస్క్ ను ఇంట్లో నిర్వహించారు. ‘రైజ్ ద ఫ్లాగ్’ పేరుతో ఈ టాస్క్ జరపడాన్ని ప్రోమోలో చూడవచ్చు. టాస్క్ లో భాగంగా ఓపెన్ ఏరియాలో 3 బకెట్లతో నీటిని ఏర్పాటు చేశారు. ఒక్కో బకెట్ వద్ద ఒక్కో టీమ్ సభ్యుడు నిలబడి.. ఆ నీటిని తన గేమ్ పార్ట్నర్ వైపు విసరాల్సి ఉంటుంది. ఆ నీటిని గేమ్ పార్ట్నర్ చిన్న బకెట్ లో క్యాచ్ పట్టి తమకు కేటాయించిన మరో నీటి తొట్టేలోకి నింపాలి. అలా నీటి తొట్టేని నింపి అందులోని బాల్స్ ను పైకి తేలేలా చేయాలి. అలా పైకి తేలిన బాల్స్ ను ఫ్లాగ్ తగలించడం ద్వారా దాన్ని ఎగరవేయాలి. ఎవరైతే ఫ్లాగ్ ను ముందుగా ఎగురవేస్తారో ఈ టాస్క్ లో విజయం సాధిస్తారు. ఈ టాస్క్ ఏ విధంగా జరిగిందో ఈ కింది ప్రోమోలో చూడవచ్చు.
