Ponnam Prabhakar: ప్రమాదాలపై ఇలాంటి అవగాహన అవసరం
Ponnam Prabhakar (imagecredit:twitter)
Telangana News

Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాలపై ఇలాంటి అవగాహన అవసరం: మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar: రోడ్డు ప్రమాదాల వల్లే అధికంగా చనిపోయే కేసులు ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి రాజధాని వరకు స్కూల్, కాలేజి, ఇతర విద్యా సంస్థల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ(Telangana Road Transport Authority) ఆధ్వర్యంలో యూనిసెఫ్ సహకారంతో బుధవారం హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఆర్టీఏ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

కరపత్రాలు పంపిణీ

రోడ్డు భద్రత, తీసుకోవాల్సిన చర్యలు, అవగాహన కల్పించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు నిబంధనల పై విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం చేయాలని సూచించారు. కరపత్రాలు పంపిణీ చేయాలని, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడిన వారికి క్యాష్ లెస్ ట్రీట్మెంట్(Cashless treatment) అమలు చేస్తుందని వెల్లడించారు. రూ. లక్షా 50వేలు 8 రోజుల్లో చికిత్స కు అందిస్తారని, దీనిపై ప్రజల్లో విసృత అవగాహన కల్పించాలని సూచించారు.

Also Read: Komati Reddy: జూబ్లీహిల్స్ ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. కేసీఆర్‌పై పంచ్‌లు

అవగాహన కార్యక్రమాలు..

యూనిసెఫ్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్(Dr. Sridhar) మాట్లాడుతూ.. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీస్ రిపోర్ట్ ప్రకారం 10-19ఏళ్లల్లో మరణిస్తున్న వారు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు కారణమన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ , ముంబై(Mumbai), హైదరాబాద్(Hyderabad) పట్టణాలను ఎంపిక చేసి అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దేశంలో సగటున 1317 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, 477 మరణాలు ప్రతి రోజూ సగటున మృతిచెందుతున్నారని పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్ట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్(Dean of the Indian Institute of Public Health) డాక్టర్ శైలజ మాట్లాడుతూ.. రోడ్డు నిబంధనలపై స్కూల్‌లు, కాలేజీల్లో అవగాహన కల్పించాలన్నారు.

Also Read: Jr NTR weight loss: ఎన్టీఆర్ వెయిట్ లాస్‌కి కారణం ఇదేనా.. ప్రతిసారీ ఎందుకిలా..

Just In

01

Indian Railways: గుడ్ న్యూస్.. వందే భారత్ స్లీపర్‌లో.. అదిరిపోయే ప్రాంతీయ వంటకాలు!

Purushaha: రాంగ్ బటన్ ప్రెస్ చేశాడు.. రిజల్ట్ చూశారా!

IPL-Bangladesh: ఐపీఎల్ ప్రసారంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం షాకింగ్ ఆదేశాలు

Road Safety: పాఠశాల విద్యార్థుల భద్రత డ్రైవర్లదే: ఇన్‌స్పెక్టర్ కంచి వేణు

Ravi Teja BMW: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?