Roja: దక్షిణాది సినీ పరిశ్రమలో 90వ దశకంలో అగ్రకథానాయికగా వెలుగొందిన, ప్రస్తుతం రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సినీ నటి, వైఎస్ఆర్‌సీపీ నేత రోజా (Roja) దాదాపు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపై రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఆమె అభిమానులకు, సినీ ప్రేక్షకులకు సంతోషాన్నిచ్చే ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. రోజా రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం పేరు ‘లెనిన్ పాండియన్’ (Lenin Pandiyan). ఇది ప్రముఖ నిర్మాణ సంస్థ సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై, నూతన దర్శకుడు డిడి బాలచంద్రన్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రంలో రోజా ‘సంతానం’ (Santhanam) అనే ముఖ్య పాత్రను పోషించనున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.
Also Read- Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ కౌంటర్!
డీగ్లామరైజ్డ్ లుక్‌లో రోజా
విడుదలైన లుక్‌లో రోజా గతంలో చూసిన గ్లామరస్ పాత్రలకు భిన్నంగా, డీగ్లామరైజ్డ్ పాత్రలో పల్లెటూరి మహిళగా కనిపిస్తున్నారు. ఆమె తలపై గుడ్డ కట్టుకొని, పశువుల పాకలో పని చేస్తూ ఉన్న దృశ్యాలు గ్రామీణ నేపథ్యాన్ని, పాత్ర స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. చాలా కాలం తర్వాత రోజాను సినిమాలో చూడటంపై ఆమె అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు, తమిళంలో దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించిన రోజా 2011లో వచ్చిన ‘వీర’ అనే తెలుగు చిత్రంలో చివరిగా కనిపించారు. ఆ తర్వాత ఆమె పూర్తిగా రాజకీయాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతగా ఎదిగి, మంత్రిగానూ సేవలందించారు. ఇంతటి రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా, ఆమె నటనపై ఉన్న మమకారంతో మళ్లీ వెండితెరపైకి వస్తుండటం విశేషం.
Also Read- Monalisa Bhosle: తెలుగు సినిమాలో హీరోయిన్‌గా కుంభమేళా మోనాలిసా.. మూవీ ప్రారంభం.. వివరాలివే!
అభిమానుల స్పందనిదే..
రోజా రీ ఎంట్రీపై నెటిజన్లు, అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ‘90స్ క్వీన్ మళ్లీ వచ్చారు, వెల్కమ్ బ్యాక్’ అని కొందరు స్వాగతిస్తుండగా, మరికొందరు ‘ఇంత బిజీ రాజకీయ నాయకురాలు సినిమాకు సమయం ఎలా కేటాయించారు?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తన సహ నటీమణులైన ఖుష్బుూ, మీనా వంటి వారు ఆమెకు వెల్‌కమ్ చెబుతూ.. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. మరికొందరు నెగిటివ్‌గానూ రియాక్ట్ అవుతున్నారు. మధ్యలో అరెస్ట్ అయితే.. సినిమా ఆగిపోతుందిగా. నిర్మాత ఆలోచించలేదా? అంటూ యాంటీస్ రియాక్ట్ అవుతున్నారు. ఇలా మొత్తంగా చూస్తే.. రోజా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘లెనిన్ పాండియన్’ చిత్రంలో ప్రముఖ సంగీత దర్శకుడు గంగై అమరన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ గణేశన్ మనవడు దర్శన్ గణేశన్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు దశాబ్దానికి పైగా విరామం తర్వాత రోజా లాంటి సీనియర్ నటి ‘సంతానం’ పాత్రతో రీ ఎంట్రీ ఇవ్వడం.. ఆమె సినీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, ముఖ్యంగా 90స్ కిడ్స్, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు.
Thank you so much dear @khushsundar 🫶 https://t.co/nBuPJyPggH
— Roja Selvamani (@RojaSelvamaniRK) November 5, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
