Sudheer Babu Family (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Fauzi: ప్రభాస్ ‘ఫౌజి’లో తనయుడు.. కన్ఫర్మ్ చేసిన హీరో సుధీర్ బాబు!

Fauzi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), ‘సీతారామం’ ఫేమ్ దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజి’ (Fauji)పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. స్వాతంత్ర్యానికి పూర్వం నాటి నేపథ్యాన్ని కలిగి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా నుంచి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో చిన్ననాటి ప్రభాస్ పాత్రలో సుధీర్ బాబు (Sudheer Babu) చిన్న కుమారుడు, మహేష్ బాబు మేనల్లుడు దర్శన్ (Darshan) నటిస్తున్నాడని.. స్వయంగా నటుడు సుధీర్ బాబు తన తాజా చిత్రం ‘జటాధర’ ప్రమోషన్స్ నిమిత్తం హాజరైన ఇంటర్వ్యూలో ధృవీకరించారు.

Also Read- Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ కౌంటర్!

‘ఫౌజి’లో దర్శన్ పాత్ర వివరాలు

ప్రభాస్ చిన్నప్పటి పాత్రలో దర్శన్ నటిస్తున్న వార్త నిజమేనని సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ పాత్ర కోసం దర్శన్ చేసిన కసరత్తు గురించి వివరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా కనిపించబోతున్న నేపథ్యంలో, చిన్ననాటి పాత్ర కోసం దర్శన్‌కు ప్రత్యేక శిక్షణ ఇచ్చారట. ‘డైరెక్టర్ హను రాఘవపూడి మంత్రాలు నేర్చుకోవాలని ఒక లిస్టు ఇచ్చారు. ప్రత్యేకంగా ఓ పూజారిని పెట్టి, వాటిని సరిగ్గా పలకడం నేర్పించడం జరిగింది. వేదాల గురించి ఏకధాటిగా మూడు, నాలుగు నిమిషాలు మాట్లాడాలి. అవన్నీ నేర్చుకొని ఆడిషన్స్‌కి వెళ్లడం, సెలెక్ట్ కావడం జరిగింది. తనే ఓన్‌గా చెప్పాడు’ అని సుధీర్ బాబు వెల్లడించారు. దర్శన్ ఇంతకుముందు ‘సర్కారు వారి పాట’, ‘గూఢచారి’ వంటి చిత్రాలలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించారు. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలో ఈ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఘట్టమనేని, ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Monalisa Bhosle: తెలుగు సినిమాలో హీరోయిన్‌గా కుంభమేళా మోనాలిసా.. మూవీ ప్రారంభం.. వివరాలివే!

పెద్ద కుమారుడు చరిత్ మానస్ అరంగేట్రంపై స్పష్టత

‘ఫౌజి’ అప్‌డేట్‌తో పాటు సుధీర్ బాబు తన పెద్ద కుమారుడు చరిత్ మానస్ సినీ అరంగేట్రం గురించి కూడా ఒక కీలకమైన సమాచారాన్ని పంచుకున్నారు. చరిత్ మానస్‌ కూడా హీరోగా వెండితెరకు పరిచయం కానున్నాడని ఆయన ధృవీకరించారు. అయితే, దీనికి ఇంకా కొంత సమయం పడుతుందని తెలిపారు. ‘ఎక్కడికి వెళ్లినా చరిత్ లాంచ్ గురించే అడుగుతున్నారు. ఇంకా రెండు, మూడేళ్లు సమయం ఉంది. ప్రస్తుతం క్రికెట్ ఆటపై చరిత్ దృష్టి పెట్టాడు. మంచి కథ కుదిరితే మాత్రం హీరోగా లాంచ్ చేస్తాం’ అని సుధీర్ బాబు పేర్కొన్నారు. చరిత్ మానస్ ఇప్పటికే తన మేనమామ సూపర్ స్టార్ మహేష్ బాబు పోలికలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. జిమ్నాస్టిక్స్, డ్యాన్స్‌లో చరిత్‌కు అపారమైన ప్రతిభ ఉంది. తన కష్టం వల్లే అభిమానుల ప్రశంసలు దక్కుతున్నాయని సుధీర్ బాబు గర్వంగా చెప్పుకొచ్చారు. చరిత్ ఇంతకుముందు ‘మోసగాళ్లకు మోసగాడు’ చిత్రంలో చిన్న పాత్రలో, అలాగే ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంలో జూనియర్ నాని పాత్రలో కనిపించాడు.

">

మొత్తం మీద, ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం వారసులుగా సుధీర్ బాబు ఇద్దరు తనయులు దర్శన్, చరిత్ మానస్ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారనే విషయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దర్శన్ ఇప్పటికే ‘ఫౌజి’లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండగా, భవిష్యత్తులో చరిత్ మానస్ పూర్తిస్థాయి హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. ఈ వారసుల సినీ ప్రయాణం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Tollywood: ప్రచారంలో అలా మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత ఫూల్స్ అవడమెందుకు?

Bandla Ganesh: బండ్ల గణేష్ మాటల వెనుకున్న మర్మమేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!