Allu Aravind (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Allu Aravind: నాకో స్థాయి ఉంది.. బండ్ల గణేష్‌కు అల్లు అరవింద్ కౌంటర్!

Allu Aravind: ఈ మధ్యకాలంలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) చేసే కామెంట్స్ ఎలా వైరల్ అవుతున్నాయో తెలియంది కాదు. మరీ ముఖ్యంగా మొన్నీ మధ్య స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం కాగా, నిన్నటికి నిన్న విజయ్ దేవరకొండ‌ (Vijay Deverakonda)ని టార్గెట్ చేస్తూ, ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హీట్ వెదర్‌కి కారణం అవుతున్నాయి. ‘లిటిల్ హార్ట్స్’ (Little Hearts) ఈవెంట్‌లో హీరో మౌళికి బండ్ల గణేష్ కొన్ని సూచనలు ఇస్తే.. అలా చేయవద్దు అంటూ విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చేశారు. వాటికి కౌంటర్ అన్నట్లుగా ‘కె ర్యాంప్’ (K Ramp) సక్సెస్ మీట్‌లో బండ్ల చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఒక్క హిట్ వస్తే చాలు.. చొక్కాలు చించుకుని.. వాట్సాప్ వాట్సాప్ అంటూ, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కావాలని అడుగుతుంటారని చాలా స్ట్రాంగ్‌గా బండ్ల రియాక్ట్ అయ్యారు. అంతకు ముందు జరిగిన ఈవెంట్‌లో అన్నీ అయిపోయిన తర్వాత అల్లు అరవింద్ (Allu Aravind) వచ్చి.. క్రెడిట్ కొట్టేస్తారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తాజాగా అల్లు అరవింద్ రియాక్ట్ అయ్యారు.

Also Read- Dharma Mahesh Kakani: రూ. 10 కోట్ల బ్లాక్‌మెయిలింగ్.. భార్య, ఓ ఛానల్ సీఈవోపై హీరో ఫిర్యాదు!

నాకంటూ ఓ స్థాయి ఉంది

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్న విషయం తెలిసిందే. 7న తెలుగు, హిందీలో, నవంబర్ 14న తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్‌ను ఇటీవల బండ్ల గణేష్ మీపై చేసిన కామెంట్స్‌కు ఎలా స్పందిస్తారు? అని మీడియా ప్రశ్నించింది. అందుకు అల్లు అరవింద్ స్పందిస్తూ.. ‘నాకంటూ ఓ స్థాయి ఉంది. కాబట్టి.. అలాంటి వాటికి నేను సమాధానం చెప్పాలని అనుకోవడం లేదు. ఆ వ్యాఖ్యలపై నేను మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు’ అని అన్నారు. అల్లు అరవింద్ ఇచ్చిన సమాధానం చాలా హుందాగా ఉందని అంతా అనుకుంటూ ఉండటం విశేషం.

Also Read- Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే?

నీ జీవితమంతా నేనే

ఇక ఇదే కార్యక్రమంలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను ఉద్దేశించి అల్లు అరవింద్ మాట్లాడుతూ.. నిర్మాతగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చేశాను, చేస్తున్నాను. కోట్ల రూపాయలు సంపాదించాను. అందులో ఎటువంటి దాపరికం లేదు. అయితే ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ద్వారా నేను డబ్బు సంపాదించాలని అనుకోవడం లేదు. నాకు సంతృప్తిని ఇచ్చిన చిత్రమిది. ఈ సినిమా నిర్మించాననే విషయం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. మనకు తెలిసిన కొన్ని చెప్పలేని నిజాలను.. సినిమా మాధ్యమం ద్వారా చెప్పాలనే ఫీల్ ఈ కథ విన్నప్పుడు కలిగింది. రాహుల్ వంటి సున్నిత మనస్కుడు, కమిటెడ్ పర్సన్ మాత్రమే ఇలాంటి సినిమాను రూపొందించగలరని అనిపించింది. ఆయన కథ చెబుతున్నప్పుడు ఎంత ఉద్వేగంతో చెప్పారో, సినిమాను కూడా అంతే బాగా తెరకెక్కించారు. ఇందులో ఎన్ని పాటలున్నాయి, ఎన్ని జోక్స్ ఉన్నాయి, ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది అని చూసే సినిమా కాదిది. అలా చూస్తే ఈ సినిమాను అసలు చేయలేం. మన అక్క, చెల్లి, పిన్ని వాళ్ల మనసుల్లో ఏముంటుంది? ఎలాంటి కోర్కెలు ఉంటాయి అనుకుని మూవీ చూడాలి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కాకుండా మరో టైటిల్ ఈ సినిమాకు చెప్పమంటే ‘నీ జీవితమంతా నేనే’ అని చెప్పాలి. రష్మిక మంచి నటి అని అందరికీ తెలుసు. ఈ సినిమాలో ఆమెలోని మరో లేయర్ కనిపిస్తుంది. దీక్షిత్ నటన చూసి ఇతను తెలుగులో స్థిరపడతాడు, ఇలాంటి ప్రతిభావంతులను ప్రోత్సహించాలనిపించింది. వెంటనే నా సినిమాలో చేస్తున్నావు అంటూ చెక్ ఇచ్చాను. తను చేసని ఏ సీన్ చూసినా ఇంతకంటే బాగా చేయలేం అనేంతగా దీక్షిత్ పెర్ఫార్మ్ చేశాడు. మీడియా కూడా ఈ సినిమాను ఒక బాధ్యతగా ఫీలై ప్రమోట్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Tollywood: ప్రచారంలో అలా మాట్లాడటం ఎందుకు? ఆ తర్వాత ఫూల్స్ అవడమెందుకు?

Bandla Ganesh: బండ్ల గణేష్ మాటల వెనుకున్న మర్మమేంటి? ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

Deputy CM: వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం.. ‘మా’ బిల్డింగ్‌కు స్థలం కూడా మేమే ఇస్తాం!

CM Revanth Reddy: షేక్‌పేట డివిజన్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..!

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!