Sree Vishnu New Film Update (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Sree Vishnu: శ్రీవిష్ణు హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే?

Sree Vishnu: వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ.. హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో శ్రీవిష్ణు (Sree Vishnu). జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రేసులో దూసుకెళుతున్నారు. ఇటీవల గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్‌లో సినిమా చేసిన శ్రీవిష్ణు.. ఇప్పుడు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. శ్రీవిష్ణు హీరోగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments) తమ ప్రొడక్షన్ నెం.39 చిత్రాన్ని బుధవారం అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ సంజయ్ (Sunny Sanjay) రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ‘ప్రతి యువకుడి కథ (The Story of Every Youngster)’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టర్.. సినిమా ఎలా ఉంటుందనే ఆలోచనతో పాటు భావోద్వేగాలతో కూడిన ప్రపంచంలోకి తీసుకెళుతుండటం విశేషం.

Also Read- Bigg Boss Telugu 9: బిగ్ బాస్ ఇంట్లో దెయ్యాలు.. సుమన్ శెట్టి గేమ్ స్టార్ట్స్!

‘అనగనగా’ దర్శకుడితో..

తనకే సాధ్యమైన వినోదాత్మక నటనతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించున్న, అలాగే అన్ని రకాల భావోద్వేగాలను గొప్పగా పలికించగల సామర్థ్యమున్న నటుడిగా పేరుపొందిన శ్రీవిష్ణు, ఈ సినిమాలో మరో గుర్తుండిపోయే పాత్రకు ప్రాణం పోసేందుకు సిద్ధమవుతున్నారు. ఈటీవీ విన్‌లో విడుదలై, మంచి ఆదరణను పొందిన ‘అనగనగా’ (Anaganaga)తో అరంగేట్రం చేసి.. విమర్శకుల ప్రశంసలతో పాటు, ప్రేక్షకుల మెప్పు పొందిన దర్శకుడు సన్నీ సంజయ్, మరో గొప్ప కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సున్నితమైన భావోద్వేగాలతో నిండిన, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు, సంతృప్తిలను అన్వేషించే కథతో.. సన్నీ సంజయ్ మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నారని చిత్రబృందం తెలియజేస్తుంది. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉంటాయని, కచ్చితంగా హిట్ కొడతామని నిర్మాణ సంస్థ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది.

Also Read- Raju Weds Rambai movie: ఈ సినిమా విడుదల తర్వాత దర్శకుడికి బెదిరింపు కాల్స్ వస్తాయి.. మంచు మనోజ్

మరిన్ని వివరాలు త్వరలోనే..

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ ఈ చిత్రంగా నిర్మిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.39 గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా, చిత్ర టీమ్‌కు కాకుండా ప్రేక్షకులకు కూడా మరపురాని అనుభూతిని అందించనుందని, త్వరలోనే చిత్రీకరణ ప్రారంభమవుతుందని మేకర్స్ తెలిపారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. మరి ఇందులో శ్రీవిష్ణు సరసన నటించే హీరోయిన్, ఇతరత్రా నటులు ఎవరో తెలియాలంటే మాత్రం.. మేకర్స్ నుంచి వచ్చే మరో అప్డేట్ వరకు ఆగాల్సిందే. శ్రీవిష్ణు విషయానికి వస్తే.. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన ‘సింగిల్’ చిత్రం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. శ్రీవిష్ణు సరసన ఇవానా, కేతికా శర్మ హీరోయిన్లుగా నటించారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Roja: 90స్ క్వీన్ రీ ఎంట్రీ.. 12 ఏళ్ల తర్వాత ‘సంతానం’గా రోజా!

Khammam District: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఆర్టీసీ అద్దె బస్సులో అకస్మాత్తుగా పొగలు.. భయంతో జనం పరుగులు

Gadwal District: గద్వాల జిల్లాలో పత్తి కొనుగోలుకు కొర్రీలు.. ఆందోళనలో రైతన్నలు

Fauzi: ప్రభాస్ ‘ఫౌజి’లో తనయుడు.. కన్ఫర్మ్ చేసిన హీరో సుధీర్ బాబు!

Revolver Warning: భూపాలపల్లి జిల్లాలో గన్నుతో బీజేపీ నేత హల్ చల్.. కేసు వాదిస్తే చంపుతా అని బెదిరింపు