Thummala Nageswara Rao: ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే పత్తి కొంటామనే నిబంధన ఎత్తి వేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao)కోరారు. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాను కోరారు. జిన్నింగ్ మిల్లర్ల సమస్యలు , పత్తి కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులపై మంగళవారం ఫోన్ లో మాట్లాడారు. పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యధావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తేమ శాతం స్లాట్ బుకింగ్ పై పత్తి రైతుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రైతులు ఇబ్బంది లేకుండా పత్తి తేమ శాతం 12 శాతం పైగా ఉన్న కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
Also Read: Thummala Nageswara Rao: పత్తి సేకరణకు మరీ ఇన్ని ఆంక్షలా?.. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ
ఎకరానికి 25 క్వింటాళ్లు పెంచి కొనుగోలు చేయాలి
రైతులు, ప్రజాప్రతినిధుల విజ్ఙప్తి మేరకు, మక్కల దిగుబడి అధికంగా ఉన్న నేపథ్యంలో కొనుగోలు పరిమితి ఎకరానికి 25 క్వింటాళ్లు పెంచి కొనుగోలు చేయాలని మార్క్ ఫెడ్ ఎండీని ఆదేశించారు. తేమ శాతం స్లాట్ బుకింగ్ పై పత్తి రైతుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అదే విధంగా సీసీఐ కొత్త నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్లు సమస్యలపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి చొరవ తీసుకోవాలని లేఖలు రాశారు. రైతునేస్తం కార్యక్రమంలో భాగంగా రైతులకు భూసార పరీక్ష పత్రాలను పంపిణీ చేశారు. భూసార పరీక్షతో భూమిలో పోషకాల శాతం తెలుస్తుందన్నారు.
32 మండలాలలోని రైతులకు భూసార
రాష్ట్రవ్యాప్తంగా 1,55,000 భూసార పరీక్ష పత్రాల పంపిణీ చేశామన్నారు. జిల్లాకు ఒక మండలం చొప్పున 32 మండలాలలోని రైతులకు భూసార పరీక్ష పత్రాల పంపిణీచేసినట్లు వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియలు సవ్యంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కాటన్ అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి కి సూచించారు. ప్రతి రైతు వరి, పత్తి పంటల బదులు ఆయిల్ పామ్ పంట సాగు చేపట్టాలని, ఈ పంటల ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చని, ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం మొక్కలు, డ్రిప్, అంతర పంటల సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నదని, ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కోకో, మిరియాలు, వక్క, సాగు చేయడం వలన ఒకే భూమిలో ఎక్కువ రకాలైన పంటల సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చన్నారు.
Also Read: Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల
