Shambala Movie: వెర్సటైల్ హీరో ఆది సాయి కుమార్ నటిస్తున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల: ఎ మిస్టికల్ వరల్డ్’ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాల్ని పెంచేసిన సంగతి తెలిసిందే. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహీధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివకార్తీక్ వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా డార్లింగ్ ప్రభాస్ రిలీజ్ చేసిన ట్రైలర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సినిమా కోసం ఆది సాయి కుమార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Read also-Pithapuramlo: పవన్ కళ్యాణ్ ఇలాకాలో.. షూటింగ్ పూర్తిచేసుకున్న ‘పిఠాపురంలో అలా’
ఈ కార్యక్రమంలో.. హీరో ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. ‘మా టీజర్‌ను రిలీజ్ చేసిన దుల్కర్ కి, మాకు సపోర్ట్ చేసిన థమన్, నా స్నేహితుడు సందీప్ కిషన్, ట్రైలర్ రిలీజ్ చేసిన డార్లింగ్ ప్రభాస్ కి థాంక్స్. ట్రైలర్ చూసి కిరణ్ అబ్బవరం అభినందించారు. రానా కూడా మా ట్రైలర్ చూసి మెచ్చుకున్నారు. ఈ మూవీకి తనవంతు సాయం చేస్తానని రానా మాటిచ్చారు. మా నిర్మాతలు ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంతో వారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను. యుగంధర్ ఈ మూవీని అద్భుతంగా రూపొందించారు. డిసెంబర్ 25న మా చిత్రాన్ని రిలీజ్ చేయబోతోన్నాం. మా చిత్రం కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.’ అని అన్నారు.
Read also-Shiva 4K Trailer: ‘శివ’ రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది చూశారా.. ఏంటి భయ్యా ఆ ర్యాంపేజ్..
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ .. ‘శివుడు ఆశీస్సులతో మా ‘శంబాల’కు అంతా పాజిటివిటీనే ఎదురవుతోంది. టాలీవుడ్ అంతా కూడా మా కోసం ముందుకు వస్తున్నారు. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. టెక్నికల్‌గా ఎంతో గొప్ప స్థాయిలో ఉంటుంది. ట్విస్ట్, టర్న్స్ ఇలా అన్నీ అద్భుతంగా ఉంటాయి. అర్చనా గారి పాత్ర రెగ్యులర్ హీరోయిన్ కారెక్టర్‌లా ఉండదు. ప్రతీ పాత్ర ఆడియెన్స్‌కి అలా గుర్తుండిపోతుంది. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేశారు. ప్రవీణ్ విజువల్స్, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్‌లో ఉంటాయి. బడ్జెట్ పెరుగుతున్నా కూడా నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నాకు సపోర్ట్‌గా నిలిచారు. డిసెంబర్ 25న మా సినిమాను అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు. హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ .. ‘‘శంబాల’ లాంటి అద్భుతమైన చిత్రంలో మంచి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది. ఇంతకు పదింతలు సినిమా ఉంటుంది. ఆది కి ఈ మూవీతో బ్లాక్ బస్టర్ వస్తుంది. డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని అందరూ చూడండి’ అని అన్నారు.
