Warangal District: మొంథా తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి ఇంకా గ్రేటర్ వరంగల్ ప్రజలు కోరుకునే లేదు. ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో ఇండ్లలో చేరిన బురద శుభ్రం చేసుకుంటున్నారు. వర్షం పోయింది ఇక తేరుకుంటాం అనుకుంటుండగా మళ్ళీ వర్షాలు దంచి కొడుతుండడంతో ప్రజలు తమ కోరుకునేది ఎట్లా అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మొంథా తుఫాన్ తో గ్రేటర్ వరంగల్(Warangal) లోని వందలాది కాలానీల్లో వరద చేరి ప్రజల జీవనాన్ని స్తంభింపజేసింది. మునుపెన్నడు లేని విధంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రాణ నష్టం కూడా వాటిల్లింది. వరదకు కొట్టుకుపోయిన రోడ్లు ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. మళ్ళీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
కోలుకోలేని స్థితిలోకి అన్నదాతలు
మొన్నటి తుఫాన్ ప్రభావంతోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అడపా దడపా మిగిలిన పంటలు చేతికి రాకుండా ఇప్పుడు కురుస్తున్న వర్షాలు అన్నదాతలను ముంచుతున్నాయి. పత్తి పంట పూర్తిగా పాడై పోయింది. వరి పంట అయిన కాపాడుతుందని ఆశపడ్డ రైతులకు ఇప్పుడు పడుతున్న వర్షాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కోతకు వచ్చిన వేలాది ఎకరాల్లో వరి పంట నెలకు ఒరిగి మొలకెత్తే స్థాయికి చేరుకుంది. కోసి ఆరబోసిన, కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం ఆరబోసుకునే పరిస్థితి లేక నలుపు ఎక్కడంతోపాటు మొలకెత్తే పరిస్థితి వచ్చింది. తేమా ఎక్కువగా ఉండడంతో కొనుగోలు చేసేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. దీంతో రైతులు కోలుకోలేని స్థితిలోకి చేరుకున్నారు.
రోజు రోజుకు పెరుగుతున్న నష్టం..
మొంథా తుఫాన్ తో నష్టపోయిన పంటలను అంచనా వేసే పనులు అధికారులు నిమగ్నమయ్యారు. ఒకవైపు అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తుండగానే ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో రోజురోజుకు నష్టం తీవ్రమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బైక్ పై వెళ్లి పంటలను పరిశీలించారు. వరదల్లో నీట మునిగిన పంటలను వరంగల్ కలెక్టర్ సత్య శారదదేవి, హనుమకొండ(Hanumakonda) జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్(Collector Sneha Shabarish) పరిశీలించి రైతులను ఓదార్చారు. అయితే అధికారులు మంగళవారం సాయంత్రం వరకు పంట నష్టం లెక్కలు తేల్చి ప్రభుత్వానికి నివేదిక పంపించనున్నారు. మంగళవారం కురిసిన వర్షంతో మరింత నష్టం పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: MLA Sanjay Kumar: హృదయ విదారక ఘటన.. డబ్బులు లేక తల్లిని మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లిన కొడుకు
మార్కెట్లో తడిసిన పత్తి జొన్నలు
మొంథా తుఫాన్ ప్రభావం, వరుసగా సెలవులు రావడంతో మంగళవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కు పత్తి మొక్కజొన్న అమ్ముకునేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పత్తి బస్తాలను షెడ్లకు తరలించేందుకు రైతులు అవస్థలు పడ్డారు. అయిన పత్తి బస్తాలు, మొక్కలు తడవడంతో రైతులు
ఆవేదన చెందారు. అకాల వర్షంతో పత్తి, వరిధాన్యం కొనుగోళ్లపై ఎఫెక్ట్ ఉంటుందని రైతులు ఆందోళన చెందుకున్నారు.
కొనుగోలుదారులకు తగిన ఆదేశాలు..
అకాల వర్షాల కారణంగా పంట తడిసిపోవడం ఆరబెట్టుకునేందుకు సరైన అవకాశం లేకపోవడంతో రైతులకు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరి ధాన్యం పత్తి మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు మిల్లర్లు కొనుకుంటారు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. తేమ పేరుతో కొనుగోలు చేసేందుకు నిరాకరిస్తుండడంతో అన్నదాతలు దాన్యం తరలించుకోలేదు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి మిల్లర్లకు తగిన అవకాశం ఇచ్చి తేమ పేరుతో ఇబ్బందులు పెట్టకుండా తడిసిన తమ వరి ధాన్యాన్ని పత్తిని కొనుగోలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Also Read: DGP Sivadhar Reddy: చేవెళ్ల బస్సు ప్రమాదం.. ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ.. కీలక విషయాలు వెల్లడి
