Diabetes: షుగర్ (డయాబెటిస్) నివారణ కోసం చాలామంది చక్కెర ఎక్కువగా ఉండే పండ్లను దూరంగా ఉంచుతారు. ముఖ్యంగా మామిడి పండును, ఇది ఎక్కువ చక్కెర కలిగి ఉందని భావించి, డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుందనే భయంతో చాలా మంది తినరు. కానీ, తాజాగా చేసిన పరిశోధనల్లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి.
జార్జ్ మేసన్ యూనివర్సిటీ పరిశోధనలో కొత్త విషయాలు
జార్జ్ మేసన్ యూనివర్సిటీ (George Mason University)లో నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. రోజూ మామిడి పండు తిన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయులు నియంత్రితంగా ఉండటం, శరీర కొవ్వు తగ్గడం కనిపించింది. తక్కువ చక్కెర ఉన్న స్నాక్స్ తిన్నవారితో పోల్చితే, మామిడి తిన్నవారిలో మెటబాలిజం మరింత మెరుగ్గా ఉందని పరిశోధకులు గుర్తించారు.
ఎక్కువ చక్కెర ఉన్నా ఆరోగ్యకరం ఎందుకు?
ఈ అధ్యయనాన్ని అసిస్టెంట్ ప్రొఫెసర్ ముఖ్యమైన విషయాలను తెలిపారు. “మన ఆహారంలో ఉన్న చక్కెర పరిమాణమే కాదు, ఆ ఆహారం మొత్తంగా కలిగించే ప్రభావమే ముఖ్యం.” మామిడిలో ఉన్న సహజ చక్కెరతో పాటు ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో, తక్కువ చక్కెర ఉన్న గ్రానోలా బార్లు లేదా ప్యాకేజ్డ్ స్నాక్స్‌లో పోషకాలు తక్కువగా ఉండి, కొన్ని సందర్భాల్లో డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయని చెప్పారు.
ఎలా పరీక్షించారు?
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిని రెండు గ్రూపులుగా చేశారు. ఒక గ్రూప్ రోజుకు ఒక తాజా మామిడి పండు (32 గ్రాముల చక్కెర) తిన్నారు. మరొక గ్రూప్ రోజుకు ఒక తక్కువ చక్కెర గ్రానోలా బార్ (11 గ్రాముల చక్కెర) తిన్నారు. ఆరు నెలలపాటు జరిగిన ఈ అధ్యయనంలో, మామిడి తిన్న గ్రూప్‌లో బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ మెరుగ్గా ఉండటం, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడం, బాడీ ఫ్యాట్ తగ్గడం వంటి ఫలితాలు వచ్చాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ బాధ్యత వహించదని గమనించగలరు.
