Hyderabad Police ( Image Source: Twitter)
తెలంగాణ

Hyderabad Police: సైబరాబాద్ షీ టీమ్స్ జులాయిలపై దాడి.. 142 డెకాయ్ ఆపరేషన్లలో 76 మంది అరెస్ట్, 29 జంటలకు కౌన్సెలింగ్

Hyderabad Police: మహిళలు, యువతులను వేధిస్తున్న జులాయిల ఆట కట్టించేందుకు సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది గడిచిన ఒక్క వారంలోనే 142 డెకాయ్ ఆపరేషన్లు జరిపింది. ఈ క్రమంలో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 76 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాపులు, కాలేజీలు, స్కూళ్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, మెట్రో స్టేషన్లలో పోకిరీల ఆగడాలు మితిమీరుతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన కరణం వీరి ఆట కట్టించేందుకు చర్యలకు శ్రీకారం చుట్టారు. సివిల్ దుస్తుల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించిన షీ టీమ్స్ పోలీసులు 76 మంది జులాయిలను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. వీరిలో 51 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, మిగితా వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Also Read: Mallujola Venugopal: ప్రస్తుత పరిస్థితుల్లో లొంగి పోవాల్సి వచ్చింది.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల మధ్య పనిచేయాలనే సంకల్పం!

చిన్న చిన్న కారణాలతో గొడవలు పడుతూ కాపురాలను నరకం చేసుకున్న 29 జంటలకు కూడా షీ టీమ్స్ సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చారు. వారి సమస్యలు సావధానంగా తెలుసుకుని రాజీ కుదిర్చారు. అంతేకాకుండా, రాత్రి కాగానే రోడ్ల మీదకు వస్తూ అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్న 9 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేసి, వారిలో ముగ్గురిని రెస్క్యూ హోంకు తరలించారు. మరోవైపు, కమిషనరేట్ పరిధిలోని వేర్వేరు చోట్ల సమావేశాలు ఏర్పాటు చేసి మహిళల భద్రత కోసం ఉన్న చట్టాలు, వారి హక్కులపై అవగాహన కల్పించారు. వీటిల్లో 223 మంది మహిళలు పాల్గొన్నారు. ఎలాంటి సమస్య ఎదురైనా మహిళలు ఉమెన్ హెల్ప్​లైన్ నెంబర్ 181కి ఫోన్ చేయాలని డీసీపీ సృజన సూచించారు. చిన్నపిల్లల వేధింపులపై 1098కు, అత్యవసర పరిస్థితుల్లో 100 నెంబర్‌కు, సైబర్​ నేరాల బారిన పడ్డవారు 1930 నెంబర్​కు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Also Read: Vishnupriya: బిగ్ బాస్ కి వెళ్లినందుకు తనకు తానే తిట్టుకున్నానని సంచలన కామెంట్స్ చేసిన యాంకర్ విష్ణుప్రియ

 

Just In

01

Seethakka: నెదర్లాండ్ పర్యటన మంత్రి సీతక్క పర్యటన.. ఘన స్వాగతం పలికిన తెలుగు వాసులు

Kenya Landslides Tragedy: కెన్యాలో భారీ వర్షాలు.. విరిగిన కొండచరియలు 21 మంది మృతి, వెయ్యికి పైగా ఇళ్లు ధ్వంసం

Baahubali The Epic: అదరగొడుతున్న ‘బాహుబలి ది ఎపిక్’ వీకెండ్ కలెక్షన్లు.. ఎంతంటే?

Hydra: కూకట్‌పల్లి చెరువుకు పూర్వవైభవం హైడ్రా అద్భుతం.. స్థానికుల ఆశ్చర్యం

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆర్టీసీ ఢీ.. స్పాట్లో 17 మంది మృతి