Talasani Srinivas Yadav ( image credit: swetcha reporter)
Politics

Talasani Srinivas Yadav: సంక్షేమ పధకాలు ఆగితే పోరాటం చేస్తాం.. మాజీ మంత్రులు తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas Yadav: కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకపోతే పథకాలు ఆగుతాయని అంటున్నారని, ప్రజలను భయపెడుతున్నారా? అని మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,  (Talasani Srinivas Yadav)పద్మారావుగౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. సంక్షేమ పధకాలు ఆగితే పోరాటం ఎట్లా చేయాలో మాకు తెలుసు అని స్పష్టం చేశారు. అసెంబ్లీని ఏ విధంగా స్తంభింపచేయాలో మాకు తెలుసు అని పేర్కొన్నారు. అసెంబ్లీలో మాట్లాడకుండా పనిచేసే ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని వెల్లడించారు. సీఎం భాష ఇప్పటికైనా మార్చుకోవాలని సూచించారు.

Also Read: BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

బీఆర్ఎస్ పాలనలో 44 వేల కోట్లు

కాంగ్రెస్ కు ధైర్యం ఉంటే ఒపీనియన్ పోల్ కు సిద్దం కావాలని సవాల్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో 44 వేల కోట్లు హైదరాబాద్ నగరంలో ఖర్చు పెట్టామని, కాంగ్రెస్ కేవలం 4,600 కోట్లు మాత్రమే ఉమ్మడి రాష్ట్రంలో ఖర్చు పెట్టిందన్నారు. హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్ళు అయినానిర్మించారా అని ప్రశ్నించారు. తులం బంగారం,పింఛన్లు ఇస్తామన్న రేవంత్ రెడ్డిని ఎక్కడ కట్టివేయాలన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత 4 వేల కోట్ల అభివృద్ధి జరిగిందని నిరూపిస్తే రాజీనామాకు నేను సిద్ధంగా ఉన్నానని తలసాని సవాల్ చేశారు. 23 నెలల్లో రేవంత్ రెడ్డి పాలనపై చర్చకు సిద్ధంగా ఉన్నాముమన్నారు. బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలేదని అంటే నేను రాజీనామాకు సిద్ధంగా ఉన్నానన్నారు. ప్రజలను భయపెడితే చూస్తూ ఊరుకోరుబోమన్నారు. సమావేశంలో నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, మహేందర్, కార్పొరేటర్లు సామల హేమ ,ప్రసన్న లక్ష్మి పాల్గొన్నారు.

Also Read: Sheep Distribution Scam: గొర్రెల స్కీంలో వెయ్యి కోట్లను బెట్టింగ్​యాప్‌ ఖాతాలకు మల్లింపు

Just In

01

Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. అసలేం జరుగుతుంది?

Premante Teaser: పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా సుమ.. ‘ప్రేమంటే’ టీజర్ ఎలా ఉందంటే?

Varanasi: ‘వారణాసి’ టైటిల్ పాయె.. మహేష్, రాజమౌళి టైటిల్ ఏంటో?

Rajasekhar: నాకు ఆ వ్యాధి ఉంది.. ఓపెన్‌గా చెప్పేసిన యాంగ్రీమ్యాన్!

Crime News: మూడు రోజుల్లో వీడిన హత్య కేసు మిస్టరీ.. ఎలా పసిగట్టారంటే?