Srinivas Goud: రిటైర్ ఉద్యోగులు తమ బెనిఫిట్స్ రాక నానాయాతన పడుతున్నారని వెంటనే రిలీజ్ చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో ఉద్యోగుల పాత్ర ఏంతో ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులకు దేశం లో ఎక్కడా లేని విధంగా కేసీఆర్ ఫిట్ మెంట్లు ఇచ్చారని, రెండు పీ ఆర్ సీ లు ఇచ్చారన్నారు. కేసీఆర్ కంటే ఎక్కువ ఇస్తామంటే ఉద్యోగులు కాంగ్రెస్ కు ఓట్లేశారన్నారు. 10వేల మంది డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికే 250 మంది గుండె పగిలి చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Srinivas Goud: రిజర్వేషన్ల పెంపు జీవో చెల్లదని వారికి తెలియదా.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్
ప్రభుత్వానిదే భాద్యత
వారి మరణాలకు ప్రభుత్వానిదే భాద్యత అన్నారు. ఓల్డ్ పెన్షన్ స్కీం తెస్తామని తేలేదన్నారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బును ప్రభుత్వం వాడుకుంటోందని మండిపడ్డారు. ఉద్యోగులకు 44 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు. శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులు అనారోగ్యం పాలయినా చికిత్స చేసుకోలేని పరిస్థితి అని, మెడికల్ రీ ఇంబర్స్ మెంట్ డబ్బులు రావడం లేదన్నారు. ఉద్యోగుల డిమాండ్లు నెరవేరాలంటే జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ను ఓడించాలన్నారు. అనంతరం ఉద్యోగులు ,రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పై బీ ఆర్ ఎస్ రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి .దేవీప్రసాద్ , ఉద్యోగసంఘాల నాయకులు భుజంగ రావు ,సుమిత్రానంద్ ,హమీద్ ,వేణుగోపాల స్వామి పాల్గోన్నారు.
Also Read: Srinivas Goud: బీసీరిజర్వేషన్లుకు చట్టబద్దత కల్పించాలి.. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
