Errabelli Dayakar Rao: అకాల వర్షాల వల్ల పంటలు నేలమట్టం అయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలనీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli Dayakar Rao) అన్నారు. పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురంలో వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా తీవ్రంగా నష్టపోయిన రైతు పోగు అశోక్(Ashock)ను పరామర్శించి, రైతుల బాధను అడిగి తెలుసుకున్నారు. చేతికొచ్చిన పంట కళ్లముందే నీటిపాలైపోవడం ఎంతో దారుణం అని వేల రూపాయలు పెట్టుబడి పెట్టి కష్టపడ్డ రైతులు ఇలా దెబ్బతినడం చూడలేనిది. వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది, అని ఎర్రబెల్లి ఆవేదన వ్యక్తం చేశారు.
నష్టపోయిన ప్రతి రైతుకూ..
ప్రభుత్వం కేవలం మాటలకు పరిమితం కాకుండా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, నష్టపోయిన ప్రతి రైతుకూ తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు అదైర్యపడొద్దు. మీకు న్యాయం జరిగే వరకు మీ పక్షాన నేనుంటాను అని భరోసా ఇచ్చారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్(Congress) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Also Read: Yadadri Bhuvanagiri: అధికార పార్టీ నాయకుడి అండతో ఇష్టారాజ్యం.. ఎమ్మెల్యే పేరు బదనాం చేస్తున్న వైనం!
రైతుల బాధ ఏం తెలుస్తది
రియల్ ఎస్టేట్(Real estate)లో బిజీగా ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి రైతుల బాధ ఏం తెలుస్తది..? సకాలంలో నీళ్లు, యూరియా(Urea), కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు పూర్తి చేసి ఉంటే ఈ స్థాయి నష్టం ఉండేది కాదు అని పేర్కొన్నారు. ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు.
