Koppula Eshwar: ఎస్సీ డిక్లరేషన్ లో చెప్పిక ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రెండేళ్లలో దళితులకు ఏం చేశారని నిలదీశారు. జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలోని సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ను బీఆర్ఎస్ దళిత నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు దళిత జాతి అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు.
Also Read: Koppula Eshwar: సింగరేణి మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి డిమాండ్
750 కోట్లుతో భివృద్ధి చేస్తాం
దళితులు సమాజంలో తలెత్తుకునేలా చదువుకునేందుకు సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం నిర్మించతలపెట్టారన్నారు. ఈ భవనం ఇప్పటికే పూర్తయ్యిందని కానీ ప్రారంభానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 12 కోట్ల తో ఇన్ఫ్రా సెక్షన్ డెవలప్మెంట్ కోసం నిధుల ఉన్నా, రెండేళ్లు గడుస్తున్నా సోషల్ వెల్ఫేర్ మంత్రి గానీ, సీఎం గానీ, సంబంధిత అధికారులు ఇప్పటి వరకు దీనిపై ఒక్క రివ్యూ చేయలేదు.. ముచ్చటించిన పాపాన పోలేదని మండిపడ్డారు. దళితబంధుకు నిధులు సైతం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.పేదలు అనుభవిస్తున్న భూములను రెగ్యులరైజ్ చేస్తాం అన్నారని ఇప్పటి వరకు చేయలేదని మండిపడ్డారు. ఒక్కో కార్పోరేషన్ కు 750 కోట్లు కేటాయించి వారిని అభివృద్ధి చేస్తాం అన్నారని, కనీసం కార్పోరేషన్ పై ఒక్క మాటైనా ఉచ్చరించిన పాపాన పోలేదన్నారు.
వంచించి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం
ఇప్పుడు మళ్లీ వచ్చి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మంత్రులు ఇన్చార్జీ గా తిరుగుతూ దళితులను ఓట్లు అడుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్ల తరువాత గుర్తుకు వచ్చామా అని ప్రజలు మంత్రులను నిలదీస్తున్నారన్నారు. అన్ని వర్గాలను వంచించి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ను భవనాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి తాటికొండ రాజయ్య, బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ ,ఎమ్మెల్యే లు మాణిక్ రావు ,విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్ ,రసమయి బాలకిషన్ ,డాక్టర్ మెతుకు ఆనంద్ ,సుంకే రవి శంకర్ ,చంటి క్రాంతి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్ ,రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: BRS protest: కన్నెపెల్లి పంపు హౌస్ వద్ద ఉద్రిక్తత.. అడ్డుకున్న పోలీసులు
