Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల
Telangana Govt (Image Source: Twitter)
Telangana News

Telangana Govt: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1,032 కోట్లు విడుదల.. డిప్యూటీ సీఎం ఆదేశం

Telangana Govt: తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అక్టోబర్ నెలకు సంబంధించిన ఉద్యోగుల బకాయిలను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది. ఉద్యోగుల బకాయిలతో పాటు ఆర్ అండ్ బీ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను క్లియర్ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు ప్రకటించారు. ఈ మేరకు సుమారు రూ.1,031 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం ఉదయం ప్రజా భవన్ లో ఆర్థిక శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కు ఆదేశాలు జారీ చేశారు.

గత ప్రభుత్వ కాలం నుంచి పెండింగ్ లో ఉన్న ఉద్యోగుల బకాయిలను దశలవారీగా ప్రతినెలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్లియర్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా అక్టోబర్ మాసానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు రూ.712 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా రూ.10 లక్షల లోపు పెండింగ్ లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలని ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది.

Also Read: IND vs AUS 2nd T20I: రెండో టీ20లో ఆస్ట్రేలియా ఘన విజయం.. ఆల్‌రౌండ్ వైఫల్యంతో టీమిండియా చిత్తు

ఇందులో భాగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖకు సంబంధించి 46,956 బిల్లుల తాలూకు రూ.320 కోట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం మేరకు అధికారులు విడుదల చేశారు. రోడ్లు – భవనాల శాఖకు చెందిన రూ.10 లక్షల లోపు విలువగల 3,610 బిల్లులకు సంబంధించిన రూ.95 కోట్లను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. అదేవిధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించిన 43,364 బిల్లులకు సంబంధించి రూ. 225 కోట్ల రూపాయలను సైతం విడుదల చేశారు.

Also Read: Pregnancy Job: గర్భవతిని చేస్తే రూ.25 లక్షలు ఇస్తా.. యువతి ఓపెన్ ఆఫర్.. తర్వాత ఏమైందంటే?

Just In

01

Medaram Jatara: మహిళలకు గుడ్ న్యూస్.. మేడారం జాతరకు ఫ్రీ బస్సు..!

Minister Ponguleti: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. పది రోజుల్లో అక్రిడిటేషన్ కార్డు జీవో: మంత్రి పొంగులేటి

Kishan Reddy: స్పీకర్ ఏ రకంగా తీర్పు ఇస్తున్నారో అర్థం కావట్లేదు?: కిషన్ రెడ్డి

Task Force: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ ప్రక్షాళన చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ

Cyber Crime: వేల కోట్లు కొట్టేస్తున్న సైబర్ క్రిమినల్స్ ముఠా.. పల్లెల్లో బ్యాంక్ ఖాతాలు తీసి..!