The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి (Deekshith Shetty) జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’. ఈ సినిమాను నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. సరికొత్త ప్రేమ కథను పాన్ ఇండియా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీన తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ని మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకుని, సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయగా, తాజాగా ఈ మూవీ నుంచి ‘కురిసే వాన..’ అనే లిరికల్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.
Also Read- Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?
ఛాట్ బస్టర్ ట్యూన్
ఈ పాట ఎలా ఉందంటే.. రిపీటెడ్ మోడ్‌లో వినేలా సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ ఛాట్ బస్టర్ ట్యూన్ కంపోజ్ చేశారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా కపిల్ కపిలన్ మనసుకు హత్తుకునేలా వోకల్స్ అందించారు.
‘కురిసే వాన తడిపేయాలన్న భూమే ఏదో, 
సరదా పడుతూ పురి విప్పేస్తున్న నెమలే ఏదో, 
ఓ నీలి మేఘం, పెంచింది వేగం, 
ఆ జాబిలమ్మ చెంత చేరి వంతపాడి, కమ్మితే మైకం, 
లాయి లాయి లాయిలే..’ (Laayi Le Lyrical Video) అంటూ ఎంతో వినసొంపుగా, వినగానే ఎక్కేసేలా సాగుతుందీ పాట. మెమొరబుల్ లవ్ సాంగ్‌గా ‘కురిసే వాన..’ లవర్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్‌కు గుర్తుండిపోయేలా ఉంది. ఈ పాటలో రష్మిక మందన్నా, దీక్షిత్ శెట్టిల కెమిస్ట్రీ కూడా ఆకర్షిస్తోంది. మరీ ముఖ్యంగా కాలేజీ ప్రేమికులు ఈపాటకు బాగా కనెక్ట్ అవుతారని చెప్పుకోవచ్చు.
Also Read- Book My Show: ‘బాహుబలి ది ఎపిక్’తో మాస్ మహారాజాకు దెబ్బపడేలానే ఉందిగా..
టీమ్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది
ప్రస్తుతం ఈ సినిమాపై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. సమర్పకుడు అల్లు అరవింద్, దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌తో పాటు ఇతర చిత్ర బృందం మొత్తం ఈ సినిమా గురించి చెబుతున్న విశేషాలు వింటుంటే.. కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తోంది. మరీ ముఖ్యంగా రష్మికా మందన్నా ఈ సినిమాకు రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా నటించింది అంటే, కథపై ఎంత నమ్మకంగా ఉందో అర్థమవుతోంది. రాహుల్ రవీంద్రన్ ఈ కథను ఎప్పుడో అనుకున్నారట. దానిని కథగా రాసి.. ఆహాకు చేయాలని చూస్తే.. అల్లు అరవింద్‌కు నచ్చి, థియేటర్‌లోకి వచ్చే కంటెంట్ ఇందులో ఉంది. మంచి సినిమా అవుతుందని ప్రోత్సహించడంతో.. ఈ కథ థియేటర్లకు చేరబోతుంది. ఈ సినిమా ఆడవాళ్లందరికీ తను ఇచ్చే హగ్‌గా రష్మిక చెప్పుకోవడం కూడా.. సినిమాపై భారీ హైప్‌ని క్రియేట్ చేస్తుంది. చూద్దాం.. మరి ఈ గర్ల్ ఫ్రెండ్ ఎంతమందిని మెప్పిస్తుందో..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				