Ravi Teja (Image Source: x)
ఎంటర్‌టైన్మెంట్

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Ravi Teja: సినిమా పరిశ్రమ అంటేనే సక్సెస్ చుట్టూ తిరిగే ప్రపంచం. ఇక్కడ ఒక నటుడు నిలబడాలంటే వరుస విజయాలు తప్పనిసరి. కానీ, ఈ సూత్రాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా తనదైన శైలిలో దూసుకుపోతున్న ఏకైక హీరో మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja). ఒక హిట్ తర్వాత రెండు మూడు ఫ్లాప్‌లు వెంటాడుతున్నా, ఆయన చేతిలో మాత్రం సినిమాలకు కొదవ ఉండటం లేదు. ప్రస్తుతం రవితేజకు బిగ్గెస్ట్ హిట్ వచ్చి చాలా కాలమే అవుతున్నా, ఆయన కెరీర్ గ్రాఫ్ మాత్రం అసాధారణంగా కొనసాగుతోంది. ఒకపక్క కొత్త తరం హీరోలు ఒక సినిమా పూర్తి కావడానికి సంవత్సరాలు తీసుకుంటుంటే, రవితేజ మాత్రం ఏడాదికి కనీసం రెండు నుంచి మూడు సినిమాలు విడుదల చేస్తూ, నిరంతరం షూటింగ్‌లతో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు ఐదు వరకు ప్రాజెక్ట్స్ వివిధ దశల్లో ఉన్నాయంటే, ఇండస్ట్రీలో ఆయనకున్న ప్రత్యేక స్థానం ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Also Read- Janagam: కాసేపట్లో ఇంటికి వచ్చేస్తానమ్మా.. అని చెప్పిన కొద్దిసేపటికే వరదలో యువతి గల్లంతు.. జనగాంలో విషాదం

ఫ్లాప్‌లు వెంటాడినా అవకాశాలు తగ్గకపోవడానికి కారణం

వరుస ఫ్లాపులు పలకరించినా రవితేజకు డిమాండ్ తగ్గకపోవడానికి ప్రధాన కారణాలు రెండు. వాటిలో ముఖ్యమైనది ఆయన ‘వర్క్ ఎథిక్’, వ్యాపార విలువ అని చెప్పొచ్చు. రవితేజ సినిమాలు చాలా వేగంగా పూర్తవుతాయి. సాధారణంగా పెద్ద హీరోల సినిమా నిర్మాణానికి పట్టే సమయం కంటే సగం సమయంలోనే రవితేజ తన షెడ్యూల్‌ను పూర్తి చేస్తారు. ఆయన సెట్స్‌లో ఇచ్చే అంకితభావం, సమయపాలన నిర్మాతలు, దర్శకులకు ఎంతో విలువైనవి. ఈ వేగం వల్ల నిర్మాణ వ్యయం నియంత్రణలో ఉంటుంది. ఆయన తన విజయ రహస్యం గురించి తరచూ చెప్పే మాట ఒక్కటే.. ‘మనం చేసే పనిపై వందశాతం దృష్టి పెట్టి, కష్టపడితే.. ఏదో ఒకరోజు సక్సెస్ తప్పకుండా వస్తుంది. ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. అన్నిటికంటే మనపై మనకు నమ్మకం ఉండటం ముఖ్యం’. ఈ పాజిటివ్ దృక్పథమే ఆయనను గ్యాప్ లేకుండా ముందుకు నడిపిస్తుంది.

Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?

మినిమమ్ గ్యారెంటీ ఇమేజ్

రవితేజకు తెలుగు రాష్ట్రాల్లో ఒక బలమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా ఫ్లాప్ అయినా కూడా, మొదటి మూడు రోజుల్లో మాస్ ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగలిగే సత్తా ఉంటుంది. దీనివల్ల నిర్మాతలకు పెట్టుబడిలో కొంత భాగాన్ని (షేర్లు, నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా) త్వరగా రికవరీ చేసుకునే అవకాశం దక్కుతుంది. మార్కెట్‌లో ఆయనకు ఉన్న ఈ మినిమమ్ గ్యారెంటీ ఇమేజ్ కారణంగా, నిర్మాతలు రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఏది ఏమైనా, రవితేజ తన స్ఫూర్తిదాయకమైన కెరీర్‌తో ఇండస్ట్రీలో ప్రత్యేకతను చాటుతున్నారు. ఆయన వ్యక్తిగత సిద్ధాంతాలే ఆయన్ను ఇప్పటికీ సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెడుతున్నాయి.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు