Etela Rajender: భారతదేశ తొలి ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి లేడుకల సందర్బంగా శామీర్ పేట్ లోని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etela Rajender) నివాసంలో యూనిటీ మార్చ్ వాల్క్ ఫర్ యూనిటీ, వాల్క్ ఫర్ భారత్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్ ప్రసంగించారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్బంగా భారతదేశంలోని అన్ని జిల్లాల్లో మేరా యువ భారత్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోని పాఠశాల, కళాశాలలో ఐక్యత పాదయాత్రలు, వ్యాసరచన పోటీలు, క్రీడా పోటీలు, క్విజ్ పోటీలు పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
Also Read: Etela Rajender: ఆ నియోజకవర్గంలో స్థానిక సంస్థల బీఫాంలపై.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
విద్యాసంస్థలను ఇబ్బందులపాలు
అదేవిదంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఎంపీ ఈటల ధ్వజమెత్తారు. ముందే హెచ్చరికలు జారీ చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా మొంథా తుఫాన్ భారీన పడి రాష్ట్రానికి తీవ్రనష్టం వాటిల్లేలా చేసిందన్నారు. మొంథా తుఫాన్ బాధితులను పరమార్శిస్తూ వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అటు ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు అందక విద్యాసంస్థలను ఇబ్బందులపాలు చేస్తుందని, ఫీజు రియంబర్స్ మెంట్ అందక విద్యార్థులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయతీలలో అప్పటి సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు చేసిన పనుల బాకాయిలు రాకా వారిని అప్పులపాలు చేసిందన్నారు.
కేసీఆర్ చేసిన తప్పే ఇప్పటి సీఎం చేస్తున్నారు
అప్పటి సీఎం కేసీఆర్ చేసిన తప్పే ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారన్నారు. త్వరలో ప్రజలు కేసీఆర్ కు బుద్ది చెప్పినట్లే, రేవంత్ రెడ్డికి కూడా చెప్తారన్నారు. నాయకులకు జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక మీద ఉన్న శ్రద్ద రాష్ట్ర అభివృద్ధి పై లేదన్నారు. ఈ కార్యక్రమంలో మేరా యువ భారత్ పొగ్రాం ఇంచార్జ్ ఐసయ్య, జిల్లా స్ప్రోర్స్ ఆఫీసర్ ధామోదర్, ఎన్ఎస్ఎస్ పోగ్రాం ఆఫీసర్ విశ్వనాథ్, ప్రభుత్వ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్పోర్స్ నామినేట్ మెంబర్లు బుచ్చయ్య కుమార్, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, నాగరాజు, ముత్యం రెడ్డి, సుధాకర్, మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు బుద్ది శ్రీనివాస్, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ క్యాండిడెట్ సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: MP Etela Rajender: ఆత్మగౌరవం కోల్పోయాక పదవి గడ్డిపోచతో సమానం.. ఈటల సంచలన వ్యాఖ్యలు
