Jubilee Hills By Election (image credit: swetcha reporter)
Politics, లేటెస్ట్ న్యూస్

Jubilee Hills By Election: ప్రభుత్వ పథకాలను నమ్ముకుని ముందుకు.. భవిష్యత్ అవసరాలను గుర్తు చేస్తూ ఇంటింటికీ కాంగ్రెస్!

Jubilee Hills By Election: రెండేళ్ల అభివృద్ధి నినాదంతో కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ముందంజలో ఉన్నది. ఈ నియోజకవర్గంలో 3.98 లక్షల మంది ఓటర్లుండగా, దాదాపు లక్ష కుటుంబాలు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో లబ్ధి పొందుతున్నట్లు కాంగ్రెస్ చెప్తున్నది. ఆరు గ్యారంటీలతో పాటు సన్నబియ్యం పథకాలు, ప్రభుత్వం అమలు చేసిన పథకాలన్నీ ఇక్కడ అధికార పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా మారాయని బలంగా విశ్వసిస్తున్నది. నియోజ కవర్గంలో 200 యూనిట్లలోపు ఉచిత గృహ విద్యుత్ లబ్ధిదారులు 25,925 కుటుంబాలు ఉండగా, రూ.500 లకు గ్యాస్ సిలిండర్ లబ్దిదారులు 19,658 కుటుంబాలు ఉన్నట్లు గుర్తించారు.

14,197 కొత్త రేషన్ కార్డులు

అదే విధంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణంతో 2023 డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు హైదరాబా ద్లో కోటి మందికిపైగా జీరో టికెట్పై ప్రయా ణించారు. దాదాపు రూ.2,410 కోట్లు ఆదా చేసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గపరి ధిలోని మహిళలు దాదాపు రూ.120 కోట్లు ఆదా చేసుకున్నట్లు సర్కార్ వివరిస్తున్నది. దీంతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోఅర్హులైన పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. 14,197 కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. ప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అదనంగా 8.123 మంది పేర్లను నమోదు చేసింది. రేషన్ కార్డున్న ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నది. వీటన్నింటినీ నియోజ కవర్గంలో మరింత విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నది.

Also ReadJubilee Hills By Election: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో న్యూ రూల్స్.. ఇవి తప్పనిసరి..!

11,328 మందికి పెన్షన్లు.. కొత్త ప్రోగ్రామ్స్‌కూ పర్మిషన్లు

వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, డయ లాసిస్ పేషంట్లకు ఇచ్చే ఇందిరమ్మ ఆసరా పెన్షన్లను నియోజకవర్గంలో 11.328 మంది ప్రతి నెలా అందుకుంటున్నారు. దీంతో పాటు ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ప్రతి రోజు ఉదయం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ జీహెచ్ఎంసీలో విజయవంతంగా అమలవుతున్నది. సిటీలో ప్రతి రోజు 25 వేల మంది పేదలు, బస్తీ వాసులు, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు దీనివల్ల డబ్బు ఆదా చేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్ నియో జకవర్గంలోని బస్తీలోని కార్మికులూ ఈ పథ కాన్ని వినియోగించుకుంటున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక నియోజక వర్గంలో స్పెషల్ డెవెలప్మెంట్ ఫండ్ కింద రూ.5.51 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణం. మౌలిక వసతుల అభివృద్ధి పనులు నిర్మా ణంలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని అన్ని ప్రాంతాలకు క్రమం తప్పకుండా నల్లా నీటిని సరఫరా చేసే పనులకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.

రూ.6.43 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం

నల్లా నీటి సర ఫరాతో పాటు సీవరేజీ అభివృద్ధి పనులకు రూ.6.43 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. అంతేగాక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్, రోడ్ నెంబర్ 45 జంక్షన్, ఫిల్మ్ నగర్, మహారాజా అగ్రసేన్, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బంది అధిగమించేలా రూ.826 కోట్ల ఖర్చుతో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే పరి దం పాలనా అనుమతులు మంజూరు చేసింది. పోస్ట్ కొత్తగా పవర్ ట్రాన్స్ ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, 11కేవీ ఫీడర్లు, దాదాపు 13 కిలోమీటర్ల మేరకు ఎల్ లైన్ ఆధునీకరణ పనులను రూ.11 కోట్లు ఖర్చు చేస్తున్నది. రూ.162 కోట్లతో అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ వేయాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదనల ను సిద్ధం చేసింది. ఇవన్నీ కాంగ్రెస్ అభ్యర్థి గెలుపునకు కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు నమ్ముతున్నారు.

డివిజన్లలో మంత్రుల రౌండప్

మరోవైపు, ఉప ఎన్నికలో కాంగ్రెస్ లాస్ట్ రౌండ్ ప్రచారస్పీడప్ చేయనున్నది. నవంబర్ 9 వరకు ప్రతీ ఇంటినీ టచ్ చేసేలా ప్రచారాని ప్లాన్ చేశారు. డివిజన్లలో మంత్రులు రౌండప్ చేస్తుండగా, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు ప్రతీ గల్లీలో విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇతర సెగ్మెంట్లలోని ముఖ్య నాయకులకూ ప్రచార బాధ్యతలు అప్పగించారు. అంతేగాక తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు హైదరాబాద్ సమీపంలోని ఇతర నాయకులూ ప్రచారం చేసేందుకు జూబ్లీహిల్స్ కు చేరుకుంటున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ద్వారా లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారుడి ఇంటికి పక్కాగా వెళ్లి ఓటు అభ్యర్థించాలని ప్లాన్ చేశారు. ఒక్కో లబ్ధిదారుడు కనీసం ఐదు ఓట్లను ప్రభావితం చేసేలా వ్యూహం అమలు చేస్తున్నారు. కనీసం 50 వేలకు తగ్గకుండా మెజార్టీ తీసుకురావాలనే లక్ష్యాన్ని పార్టీ పెట్టుకున్నది. అటు ప్రభుత్వ పథకాలు, ఇటు పార్టీ వ్యూహాలు గెలుపును సులువు చేస్తాయనే నమ్మకంతో హస్తం నేతలు ఉన్నారు.

Also Read: Jubilee Hills By Election: పొలిటికల్ హీట్.. జూబ్లీహిల్స్ ప్రచారంపైనే వాళ్ళ స్పెషల్ ఫోకస్

Just In

01

The Girlfriend: ‘కురిసే వాన’ లిరికల్.. ఎలా ఉందంటే?

OTT Platforms: ఓటీటీల స్కెచ్ ఇదేనా.. ఇలా అయితే థియేటర్స్ మూతే!

Rage Of Kaantha: రాప్ ఆంథమ్ ‘రేజ్ ఆఫ్ కాంత’ ఎలా ఉందంటే?

Ravi Teja: హిట్టు లేదు.. కానీ మాస్ మహారాజాకు గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఎలా వస్తున్నాయంటే?

Naveen Yadav: నవీన్ యాదవ్ పై చర్యలు తీసుకోండి.. ఈసీకి ఫిర్యాదు