Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ సీజన్ 9 ఈ సారి ఎవరి ఊహకి అందడం లేదు. అయితే, ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగిన విషయం అందరికి తెలిసిందే. ఈ వారం మాధురి, రీతూ చౌదరి, తనూజ, కల్యాణ్, డిమోన్ పవన్, సంజన, రాము, గౌరవ్ నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే, ఈ నామినేషన్స్ అయి పోయాక హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌లో ఒకరు మళ్లీ వస్తారని చెప్పాడు. దానిలో భాగంగానే ” ఇంటిలో ఉండే హౌస్ మేట్ గా అవకాశం” శ్రీజ, భరణీ ఇద్దరికి ఇచ్చారు.
ఇక ఈ నేపథ్యంలోనే వారికీ టాస్క్‌లు పెట్టి.. వాళ్లలో ఒక్కర్ని మాత్రమే ఇంటిలో ఉండే అవకాశం ఇస్తున్నారు బిగ్ బాస్. తాజాగా విడుదలైన డే 53కు సంబంధించిన మొదటి ప్రోమోలో హౌస్ మేట్స్ లో భరణి, శ్రీజ మధ్య ఒక టాస్క్ జరిగింది. మరి, ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఎవరు ఎవరికి సపోర్ట్ చేశారో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: CM Revanth Reddy: నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు
బిగ్ బాస్ ఇంట్లో టాస్క్‌లు ఆడినప్పుడు ఎవరో ఒకరు గాయాల పాలవ్వడం పక్కా. అలాగే శ్రీజ, భరణి గేమ్ టాస్క్ లో రెండో రౌండ్ మొదలైంది. దీంతో, ఇమ్మానుయేల్ తరఫున రాము బరిలోకి దిగాడు. ఈ టాస్క్‌లో డీమాన్ – భరణి మధ్య గట్టి పోటీనే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ కూడా పూల్‌లో పడిపోయారు. దీంతో, భరణికి బాగా గాయాలయ్యాయి. ఇంక అతన్ని మెడికల్ రూమ్‌కి తీసుకెళ్లి టెస్ట్ లు చేశారు. పడుకుని లేచేటప్పుడు అతను సరిగా లేవ లేకపోవడంతో భరణిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళారు.
ఇక నేడు రిలీజ్ అయినా ప్రోమోలో భరణి కోసం దివ్య పోటీలో దిగింది. శ్రీజ మాత్రం సోలోగా ఫైట్ చేస్తుంది. నెటిజన్స్ కూడా బిగ్ బాస్ భలే టాస్క్ పెట్టారుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
