Pawan Kalyan (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Tollywood: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) రాజకీయ ప్రస్థానం మొదలైన తర్వాత, టాలీవుడ్‌లో ఆయన పేరు జపించే ట్రెండ్ మరింత పెరిగింది. సినీ రంగంలో కొత్తగా వస్తున్నవారే కాక, ఇప్పటికే ఉన్న యువ హీరోలు సైతం తమ సినిమాల ప్రచారం కోసం ఏదో ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తూ, ఆయన అభిమానుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ పవన్ నామస్మరణ కొందరికి విజయాన్ని అందిస్తుంటే, మరికొందరికి మాత్రం అనూహ్యంగా నష్టాన్ని తెచ్చిపెడుతోంది. ఈ ట్రెండ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ డిబేట్‌గా మారింది.

ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్టపోయారు?

పవన్ కళ్యాణ్ పేరును ఉపయోగించి లాభపడిన వారిలో ఇటీవల వచ్చిన ‘డ్యూడ్’ (Dude) సినిమా హీరో ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్‌పై ఉన్న ఇష్టంతో ‘ఓజీ’ (OG) సినిమాను ప్రత్యేకంగా చూడడానికి హైదరాబాద్ వచ్చానని ఆయన ప్రకటించారు. ఆయన సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి మంచి విజయం అందుకోవడానికి పవన్ అభిమానుల మద్దతు కూడా ఒక కారణంగా నిలిచింది. ఇతర కోలీవుడ్ స్టార్లు కూడా ఏదో ఒక రకంగా పవన్ పేరును ప్రస్తావిస్తూ, తెలుగు మార్కెట్‌పై ప్రభావం చూపాలని చూస్తున్నారు. కాకపోతే, ఈ పద్ధతి అందరికీ పనిచేయడం లేదు. టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) తన ‘తెలుసు కదా’ సినిమా విడుదలకు ముందు ‘ఓజీ’పై చేసిన ట్వీట్ బాగా వైరల్ అయినప్పటికీ, ఆ క్రేజ్ ఆయన సినిమాకు అనుకున్నంతగా ఉపయోగపడలేదు.

Also Read- Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

నిజమైన అభిమానం vs పబ్లిసిటీ స్టంట్

మరో యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) పక్కా పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయినప్పటికీ, తన తాజా చిత్రం ‘కె ర్యాంప్’ ప్రమోషన్స్‌లో మాత్రం ఆయన పేరును వాడటానికి ఇష్టపడలేదు. ‘ఆయనంటే నాకు చాలా ఇష్టం. కానీ, సినిమా పబ్లిసిటీ కోసం నేను చెబుతున్నానని అంతా అనుకుంటారు. అది నాకు ఇష్టం లేదు’ అని కిరణ్ చెప్పడం, కొందరు యువ హీరోలు కేవలం ప్రచారం కోసమే పవన్ నామస్మరణ చేస్తున్నారనే వాదనకు బలాన్ని ఇస్తోంది. పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావించడం ద్వారా ఆయన అభిమానుల అటెన్షన్ లభించినా, అదే సమయంలో ఇతర యాంటీ ఫ్యాన్స్ ఆ సినిమాను చూడకుండా నష్టపరిచే ప్రమాదం కూడా ఉంది. ఈ నామస్మరణ వల్ల కంటెంట్ లేని సినిమా కూడా నెట్టుకుపోతుందనే అపోహను కొందరు హీరోలు సృష్టిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read- Jaanvi Ghattamaneni: ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసురాలు.. మహేష్‌కు ఏమవుతుందో తెలుసా?

కంటెంటే కింగ్!

ఈ మొత్తం వివాదంపై సినీ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది. ‘సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ, ఈ ప్రచార జిమ్మిక్కులు ఎందుకు?’ అనేదే వారి ముఖ్య వాదన. ఒక సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే, అది కేవలం అభిమానుల మద్దతుతోనే కాదు, సగటు ప్రేక్షకుడు ఆదరించగలిగే బలమైన కథాంశం మరియు నాణ్యమైన నిర్మాణంతో ఉండాలి. మొత్తంగా, టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్ నామస్మరణ అనేది అటు అభిమానుల అటెన్షన్ కోసం ఒక తాత్కాలిక ‘వరం’గా పనిచేసినా, కంటెంట్ లేని పక్షంలో అది సినిమా విజయానికి ‘శాపం’గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సినిమా విజయాన్ని నిర్ణయించేది చివరికి కథాబలమే అనేది అంతా తెలుసుకుంటే మంచిది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ