Bigg Boss Telugu 9 Day 52 (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Bigg Boss Telugu 9: రీ ఎంట్రీలో షాకింగ్ ట్విస్ట్.. భరణికి ఏమైంది?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (Bigg Boss Telugu Season 9) లో 52వ రోజు హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. ప్రస్తుతం హౌస్‌లో ఆల్రెడీ ఎలిమినేటై వెళ్లిన ఇద్దరు కంటెస్టెంట్స్‌‌లో ఒకరిని మళ్లీ హౌస్‌లోకి పర్మినెంట్ హౌస్‌మేట్‌గా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నంలో బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు. 52వ రోజు ఎపిసోడ్‌కు సంబంధించి తాజాగా బిగ్ బాస్ రెండు ప్రోమోలను విడుదల చేశారు. ఈ ప్రోమోలలో శ్రీజ (Srija), భరణి (Bharani) కోసం హౌస్‌లోని మెంబర్స్‌ని డివైడ్ చేసి ఓ టాస్క్ ఆడించారు బిగ్ బాస్. భరణి, శ్రీజలకు సపోర్ట్ చేసే వారిని రెండు గ్రూపులుగా ఏర్పాటు చేసి, ‘కట్టు-పడగొట్టు’ (Kattu Padagottu) అనే టాస్క్ ఆడించారు. ఈ టాస్క్‌లో ఎవరైతే గెలుస్తారో వారే.. ఇకపై ఈ హౌస్‌లో పర్మినెంట్ హౌస్ మెంబర్‌గా ఉంటారని బిగ్ బాస్ చెబుతున్నారు. ముందుగా ప్రోమో 1లో ఏముందో గమనిస్తే..

Also Read- Malavika Mohanan: చిరు-బాబీ సినిమాలో.. క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్ హీరోయిన్!

‘కట్టు – పడగొట్టు’

హౌస్‌లోని మెంబర్స్ అందరినీ ఒక చోటుకు చేర్చి.. ‘భరణి, శ్రీజ.. ఈరోజు ఇక్కడున్నారు. కానీ, ఈ ఇంట్లో కేవలం ఒక్కరికే స్థానం ఉందనే విషయాన్ని మరిచిపోకండి. పర్మినెంట్ హౌస్‌మేట్‌గా మారాలనుకుంటున్న సభ్యులు, అందుకోసం.. మీరు ఇంట్లో ఉన్న సభ్యులలో కొందరిని మీ సైనికులుగా ఎంపిక చేసుకోవాలి’ అని చెప్పగానే హౌస్‌లోని కొందరినీ ఇద్దరూ సైనికులుగా ఏర్పాటు చేసుకున్నారు. మళ్లీ బిగ్ బాస్.. ‘‘దానిని సాధించడానికి నేను ఇస్తున్న టాస్క్ ‘కట్టు – పడగొట్టు’. తమ కిచ్చిన బ్లాక్స్‌లో స్క్వేర్‌లో ఏడంతస్తుల టవర్‌ని నిర్మించాలి. ప్రత్యర్థులు ఈ టవర్‌ని పడగొట్టాలి. బజర్ మోగే సమయానికి ఏ టీమ్ టవర్ అయితే ఎత్తుగా ఉంటుందో.. ఆ టీమ్ ఆ రౌండ్ విజేత అవుతుంది’’ అని చెప్పారు. స్క్వేర్‌లో ఉన్న టవర్ విషయంలో శ్రీజ, భరణిల మధ్య వాగ్వివాదం నడుస్తోంది. సుమన్ శెట్టి వచ్చేసి.. నా డెసిషన్‌ బట్టి భరణి టీమ్ విన్.. అని సీరియస్‌గా చెబుతున్నారు. దీంతో ప్రోమో వన్ ముగిసింది.

Also Read- Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్

రెండో ప్రోమోలో మాత్రం హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ టాస్క్ డెసిషన్ తేలకుండానే.. మెడికల్ ఎమర్జెన్సీ పేరిట భరణి బయటకు వచ్చేస్తున్నట్లుగా చూపించారు. ‘సుమన్, కళ్యాణ్.. మీ నిర్ణయం తక్షణమే చెప్పండి’ అని బిగ్ బాస్ అడగగానే.. రూల్స్ కరెక్ట్‌గా ఫాలో అయి ఉంటే.. అని కళ్యాణ్ అంటుంటే.. బ్లూ బాక్స్ లోపల లేదు అని సుమన్ బిగ్గరగా అరుస్తున్నారు. ‘కళ్యాణ్, సుమన్.. మీరిద్దరు కలిసి నిర్ణయం తీసుకోలేకపోయినందున మిమ్మల్ని ఆ బాధ్యత నుంచి తొలగిస్తున్నాను. భరణి, శ్రీజ.. ఇప్పుడు మీరిద్దరూ కలిసి.. నిర్ణయం తీసుకోవాల్సిన ఒకరు ఎవరో.. మిగతా సభ్యుల్లోంచి ఎంచుకుని, తక్షణమే నాకు చెప్పండి’ అని బిగ్ బాస్ ఆర్డర్ వేశారు. ఇద్దరూ కలిసి మాధురి పేరు చెప్పారు. ‘మీరు కరెక్ట్‌గా బాక్స్‌లో ఉండాలనే పాయింట్ చెప్పలేదు. టవర్‌ని పడగొట్టాలని మాత్రమే చెప్పారు. బాక్స్‌లో లేకపోయినా టవర్ అయితే శ్రీజాదే ఉంది కాబట్టి.. శ్రీజానే గెలిచినట్టు బిగ్ బాస్’ అని మాధురి చెప్పారు. మళ్లీ ఇదే టాస్క్ కంటిన్యూ అవుతుండగా.. భరణి, పవన్ల మధ్య తోపులాట జరిగి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయారు. అలా పడిపోవడంతో భరణికి గాయం అయినట్లుగా తెలుస్తోంది. వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి.. మీరు వెంటనే హాస్పిటల్‌కు వెళ్లడం మంచిది అని చెప్పారు. దీంతో భరణి హౌస్‌ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. మొత్తంగా అయితే, ఈ రీ ఎంట్రీ ఎపిసోడ్.. ఫిజికల్ టాస్క్‌తో అందరినీ ఎంటర్‌టైన్ చేయబోతుందనేది మాత్రం అర్థమవుతోంది. మరీ ముఖ్యంగా మాధురి (Madhuri)ని న్యాయనిర్ణేతగా ఎంచుకుని శ్రీజ తన గేమ్ ప్లాన్‌ ఏంటో మరోసారి నిరూపించిందని అంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ekadashi: పెళ్ళి కానీ యువతులు ఏకాదశి రోజున తల స్నానం చేయడకూడదా?

Jubliee Hills Bypoll: కాంగ్రెస్‌ను గెలిపించండి.. బీఆర్ఎస్ చెంప చెల్లుమనాలి.. మంత్రి పొంగులేటి

ICC Women’s World Cup 2025 Final: రేపే ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఢీ.. బలాబలాలలో ఎవరిది పైచేయి!

Crime News: లక్షల విలువ చేసే హాష్​ ఆయిల్​ గంజాయి సీజ్.. ఎక్కడంటే?

Bank Holidays November 2025: నవంబర్ 2025 బ్యాంకు హాలిడే లిస్ట్.. ఈ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు మూసివేత!