Sridhar Babu (imagecredit:twitter)
తెలంగాణ

Sridhar Babu: తెలంగాణను ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

Sridhar Babu: తెలంగాణను 2030 నాటికి దేశ ఏరో-ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర “రోడ్ మ్యాప్”ను సిద్ధం చేస్తున్నామన్నారు. టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(Tata Advanced Systems Limited), సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్(Saffron Aircraft Engines) సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మంగళవారం హైటెక్ సిటీలోని ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వర్చువల్‌గా ఆయన ప్రారంభించారు.

హైదరాబాద్ అంటే కేవలం..

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ “ఏరోస్పేస్-డిఫెన్స్ – స్పేస్” హబ్ గా తెలంగాణ ను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. హైదరాబాద్ అంటే కేవలం “సిటీ ఆఫ్ పెరల్స్” మాత్రమే కాదని, ప్రొపల్షన్, ప్రెసిషన్, ప్రోగ్రెస్ నగరంగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగాల ఎగుమతులు 2023-24లో రూ.15,900 కోట్లు ఉండగా, 2024-25లో మొదటి 9 నెలల్లోనే రూ.30,742 కోట్లకు పెరిగాయన్నారు. ఇవి తమ ప్రభుత్వ పాలనలో ఈ రంగం సాధించిన వృద్ధి రేటుకు నిదర్శనమన్నారు. ఈ న్యూ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఎయిర్‌బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజిన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్ (స్టేషనరీ కాంపోనెంట్), లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ (రోటేటివ్ కాంపోనెంట్) తయారవుతాయన్నారు.

Also Read: Bigg Boss 9 Telugu: నువ్వు అమ్మాయిల పిచ్చోడివా.. ఎందుకు డిఫెన్స్ చోసుకోలేదు.. కళ్యాణ్‌ను రఫ్పాడించిన శ్రీజ!

కొత్తగా 500 మందికి ఉపాధి

తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తమవ్వడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. విమాన ప్రయాణ భవిష్యత్తును నిర్మించాలనుకుంటే – దానిని తెలంగాణలో నిర్మించండి అని అంతర్జాతీయ దిగ్గజ ఏరో సంస్థలకు పిలుపునిచ్చారు. ఇంజిన్స్, కాంపోనెంట్స్, ఎమ్మార్వో, కన్వర్షన్స్, స్పేస్, డ్రోన్స్, డిజిటల్, ఏఐ మాన్యుఫ్యాక్చరింగ్ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఎండీ సుకరన్ సింగ్, ఈడీ మసూద్ హుస్సేన్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ వైస్ ప్రెసిడెంట్ డొమినిక్ డూప్, టీజీఐఐసీ ఎండీ శశాంక, తెలంగాణ ఏరో స్పేస్ డిఫెన్స్ డైరెక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bihar Manifesto: ప్రతి కుటుంబానికి గవర్నమెంట్ జాబ్.. తేజశ్వి యాదవ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Just In

01

Naveen Chandra: ‘అరవింద సమేత’ బాల్‌రెడ్డి తర్వాత మళ్లీ ఇదే..

Bhanu Bhogavarapu: ‘మాస్ జాతర’.. రవితేజ 75వ చిత్రమని తెలియదు

Tollywood: టాలీవుడ్‌లో పవన్ నామ స్మరణ.. వారికి వరమా? శాపమా?

Telugu Indian Idol S4 Finale: మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్.. న్యూ సింగర్‌కు రవితేజ బంపరాఫర్!

Jubilee Hills Bypoll: కాంగ్రెస్‌కే మద్ధతు.. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌కు మైనార్టీల హామీ