Montha Cyclone: మొంథా సైక్లోన్ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎన్నడూ లేనంతగా వేగంగా ఈదురు గాలులతో 80 నుంచి 1080 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని వాతావరణ శాఖ(IMD) హెచ్చరికలు జారీ చేస్తుంది. మంగళవారం సాయంత్రం వరకు నల్గొండ(Nalgonda), సూర్యాపేట(Suryapeta), ఖమ్మం(Khammam), భద్రాద్రి కొత్తగూడెం(Bhadradri Kothagudem), ములుగు(Mulugu), మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలకు చిరుజల్లుల మినహా పెద్దగా వర్షం పడలేదు. బుధవారం ఉదయం నుంచే మొంథా సైక్లోన్ ఎఫెక్ట్ తో పెద్ద గాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఈ ఆరు జిల్లాలో జిల్లా ఉన్నతాధికారులు మొంథా సైక్లోన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అధికారులు సైతం మొంథా సైక్లోన్ ఎఫెక్ట్ తో క్షేత్రస్థాయిలో పర్యటించాలని, వర్షం కురుస్తున్న ప్రాంతాలను పరిశీలించి ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం మొంథా సైక్లోన్ తో అప్రమత్తంగా అధికారులు వ్యవహరించాలని ఆదేశించింది.
ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ..
మొంథా సైక్లోన్ ఎఫెక్ట్ తో నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు రెడ్ జోన్ లో ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలో కారు మబ్బులు కమ్మే వర్షం కురుస్తుంది. సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు మాత్రం బ్లూ జోన్ లో ఉన్నప్పటికీ వర్షం విస్తృతంగా కురుస్తుంది. మహబూబాబాద్ జిల్లాలో విస్తృతమైన గాలులతో భారీ వర్షం కురుస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. అధికారులు సైతం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: Sreeleela: పెళ్లి తర్వాత అలాంటి పాత్రలే ఎక్కువ చేస్తా.. వైరల్ అవుతున్న శ్రీలీల బోల్డ్ కామెంట్స్
రైతులకు తీవ్ర నష్టం
మొంథా సైక్లోన్ ఎఫెక్ట్ రైతులకు తీవ్ర నష్టాలను కలిగించే విధంగా భారీ వర్షం కురుస్తోంది. వరి పంట చేతికొచ్చే దశలో మొంథా సైక్లోన్ నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే రైతుల చేతికొచ్చే మొక్కజొన్న పంటలు తడి ఆరడం కోసం పంట కల్లాల్లో, రహదారులపై ఆరబోసుకుంటున్నారు. మొంథా సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల రైతులు మొక్కజొన్న పంటను ఆరబోసుకునేందుకు వీలు లేకుండా పోతుంది. కొంతమంది రహదారులపై ఆరబోసుకున్న పంట తడవకుండా టార్పాలిండ్ల తో కప్పుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, ప్రమాదకర స్థితిలో ఉన్న ఇండ్ల నుంచి నివాసితులను పునరావాస కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం ఆరు జిల్లాల్లో కారు మబ్బులు కమ్మి సాధారణం నుంచి భారీ వర్షం కురుస్తోంది. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. బుధవారం సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. సూర్యాపేట జిల్లాలో టోటల్ గా 44 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కాగా, యావరేజ్ వర్షపాతం 17 మిల్లీమీటర్లుగా నమోదయింది
