TG-DGP (Image source Whatsapp)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

DGP Shivdhar Reddy: మావోయిస్టుల లొంగుబాటు నేపథ్యంలో తెలంగాణ డీజీపీ కీలక వ్యాఖ్యలు

DGP Shivdhar Reddy: లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు

సీఎం పిలుపు మేరకే లొంగిపోయాం
మాది లొంగుబాటు కాదు
అభివృద్ధిలో కలిసి పని చేయటానికే బయటికి వచ్చాం
పార్టీలో చీలక నిజమే అన్న నేతలు
లొంగిపోయిన వారిపై చర్యలు ఉండవని స్పష్టం చేసిన డీజీపీ

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో ఇద్దరు అగ్రనేతలు మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivdhar Redd) ఎదుట లొంగిపోయారు. వీరిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ శంకరన్న, అలియాస్ చంద్రన్న, మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాశ్ అలియాస్​ ప్రభాత్ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకే తాము పార్టీ నుంచి బయటకు వచ్చినట్టుగా ఇద్దరూ చెప్పారు. తమది లొంగుబాటు కాదని, అభివృద్ధిలో కలిసి పని చేద్దామనే ఆలోచనతో బయటకు వచ్చామన్నారు.

Read Also- Bigg Boss Telugu 9: ఓవర్ కాన్ఫిడెంట్ పేరుతో రగులుతోన్న హౌస్.. గౌరవ్, భరణిలకు దివ్య ఇచ్చిపడేసింది

అజ్ఞాతం వీడారు…

తెలంగాణ ప్రభుత్వం పిలుపు మేరకు మావోయిస్టులు చంద్రన్న, బండి ప్రకాశ్​ అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిశారని డీజీపీ శివధర్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన చంద్రన్న పదిహేనేళ్లపాటు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేశాడని తెలిపారు. రాడికల్​ స్టూడెంట్స్ యూనియన్​ సభ్యుడిగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించినట్టు వివరించారు. 1980లో కిషన్​ జీకి కొరియర్‌గా పని చేశారని తెలిపారు. 2008లో సెంట్రల్​ కమిటీ సభ్యుడిగా ఎదిగినట్టు చెప్పారు. ఆ తరువాత రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా కూడా పని చేశారన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఇచ్చిన పిలుపు మేరకు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినట్టు చెప్పారు. దానికితోడు ఆరోగ్య పరిస్థితి క్షీణించటం, భద్రతా దళాల నిరంతర ఒత్తిడి కూడా లొంగుబాటుకు కారణాలన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ 1983లో పీపుల్స్ వార్ ఉద్యమంలోకి వెళ్లారని చెప్పారు. రాడికల్ యూత్ లీగ్ లో చేరి సంవత్సరంపాటు చురుకుగా పని చేసినట్టు తెలిపారు.

Read Also- Thummala Nageswara Rao: మొoథా తుఫాన్ నేపథ్యంలో.. పత్తి రైతులు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి తుమ్మల

1984, అక్టోబర్​లో సీపీఐ నాయకుడు అబ్రహం హత్యలో పాల్గొని తప్పించుకోవటానికి కొత్తగూడెం పారిపోయినట్టు చెప్పారు. 1985, జనవరిలో ఇదే కేసులో అరెస్టయి వరంగల్ సెంట్రల్ జైలుకు రిమాండ్​ అయినట్టు తెలిపారు. ఆ తరువాత 1988, జూన్ లో ఆదిలాబాద్ సబ్​ జైలుకు మారినట్టు చెప్పారు. అక్కడ మహ్మద్ హుస్సేన్, నల్ల ఆదిరెడ్డి ఎలియాస్​ శ్యామ్​, ముంజాల రత్నయ్య గౌడ్ తో కలిసి జైలు నుంచి పారిపోయినట్టు తెలిపారు. 1992, జూలైలో మల్కాజిగిరిలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జీవిత ఖైదు శిక్ష విధించినట్టు చెప్పారు. 2004, ఆగస్టు 15న సత్ప్రవర్తన కారణంగా బండి ప్రకాశ్ ను విడుదల చేసినట్టు తెలిపారు. ఆ తరువాత తిరిగి మావోయిస్టు పార్టీలో చేరినట్టు చెప్పారు. ఇద్దరి పేర్ల మీద ఉన్న రివార్డులను వారికే అందచేస్తామన్నారు. తెలంగాణకు చెందిన 64మంది ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్నట్టు చెప్పారు. ఇప్పటివరకు 427మంది మావోయిస్టులు లొంగిపోగా వారిలో 8మంది రాష్ట్ర కమిటీ, ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్టు తెలిపారు.

పార్టీలో చీలికలు వచ్చాయి…చంద్రన్న

మావోయిస్టు పార్టీలో చీలికలు వచ్చినట్టుగా చంద్రన్న చెప్పారు. తమది లొంగుబాటు కాదన్నారు. ప్రజలతో కలిసి పోరాటాలు కొనసాగిస్తామన్నారు. అభివృద్ధిలో పాలు పంచుకోవటానికే పార్టీ నుంచి బయటకు వచ్చినట్టు చెప్పారు. దీనికి ఆరోగ్య సమస్యలు కూడా ఓ కారణమన్నారు. మావోయిస్టు భావజాలానికి తాను ఎప్పటికీ కట్టుబడి ఉంటానన్నారు. మావోయిప్టు పార్టీలో వచ్చిన విభేధాలు, చీలికలే ప్రస్తుత పార్టీ పరిస్థితికి కారణమన్నారు. అయితే, మా సిద్ధాంతం ఓడిపోలేదు…దానిని ఓడించటం ఎవ్వరి వల్లా కాదన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిప్పర్తి తిరుపతి ఎలియాస్​ దేవ్ జీ ఉన్నట్టు తెలిపారు.

Just In

01

Azharuddin: నిజమా!.. అజారుద్దీన్‌కు మంత్రి పదవి?.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ ఊహించని ట్విస్ట్?

Mahabubabad: తుఫాన్‌ను జయించిన తెగువ.. రెండు ప్రాణాలకు పునర్జన్మ ఇచ్చిన 108 యోధులు!

Hyderabad Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపిలేని వాన.. రంగంలోకి నగర కమిషనర్లు.. క్షేత్రస్థాయిలో పర్యటన

Mahabubabad Cyclone Montha: మహబూబాబాద్ జిల్లాలో మొంథా బీభత్సం.. నిలిచిపోయిన పలు రైళ్లు.. రంగంలోకి జిల్లా ఎస్పీ!

TG CM – Cyclone Montha: తెలంగాణపై మెుంథా ఎఫెక్ట్.. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ