JD Chakravarthy O Cheliya (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

JD Chakravarthy: చిన్న సినిమాకు జేడీ సపోర్ట్.. ఏం చేశారంటే?

JD Chakravarthy: చిన్న సినిమాలకు సపోర్ట్ అందించడానికి స్టార్ యాక్టర్స్ ఎప్పుడూ ముందుంటారని మరోసారి నిరూపించారు యాక్టర్ జెడీ చక్రవర్తి (JD Chakravarthy). ఆయనొక్కరే కాదు.. ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల ట్రైలర్ లాంచ్, సాంగ్స్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు స్టార్ హీరోలు, డైరెక్టర్స్ వచ్చి, వాటికి సపోర్ట్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇది శుభపరిణామం కూడా. ఇండస్ట్రీ బాగుండాలంటే, చిన్న సినిమాలు కూడా బాగా ఆడాలి. అందుకు ఆ సినిమాలు జనాల్లోకి వెళ్లాలంటే.. ఎవరో ఒకరు సపోర్ట్ అందించకతప్పదు. అలా ఇప్పుడు జేడీ చక్రవర్తి ‘ఓ చెలియా’ (O Cheliya) అనే సినిమాకు సపోర్ట్ అందించి తన గొప్ప మనసు చాటుకున్నారు. ఇంతకీ ఈ సినిమా కోసం జేడీ చక్రవర్తి ఏం చేశారని అనుకుంటున్నారా.. ఆ విషయంలోకి వస్తే..

Also Read- Bigg Boss Telugu 9: రీ ఎంట్రీ.. శ్రీజ అరాచకం షురూ.. భరణికి బిగ్ బాస్ ముందస్తు వార్నింగ్!

అందమైన ప్రేమ గీతం

ఎస్‌ఆర్ఎస్ మూవీ క్రియేషన్స్, ఇందిరా దేవీ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపాశ్రీ కొపురు నిర్మిస్తున్న అందమైన ప్రేమ కథా చిత్రం ‘ఓ.. చెలియా’. నాగ ప్రణవ్, కావేరి కర్ణిక, ఆద్య రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతల్ని ఎం. నాగ రాజశేఖర్ రెడ్డి (Naga Rajasekhar Reddy) నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ‘ఓ.. చెలియా’ పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్ వంటి ప్రోమోషనల్ కంటెంట్ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటూ మంచి స్పందనను రాబట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి మరో అందమైన ప్రేమ గీతాన్ని చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. విలక్షణ నటుడైన జేడీ చక్రవర్తి చేతుల మీదుగా ‘నా కోసం ఆ వెన్నెల’ (Naa Kosam Aa Vennela Lyrical) అంటూ సాగే లవ్, మెలోడీ పాటను టీమ్ విడుదల చేయించింది. ఈ పాటను విడుదల చేయడంతో పాటు యూనిట్‌కు శుభాకాంక్షలు చెప్పిన జేడీకి టీమ్ కృతజ్ఞతలు తెలిపింది.

Also Read- Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది

పాటను విడుదల చేసిన అనంతరం జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘ఓ.. చెలియా’ అనే మూవీ నుంచి ‘నా కోసం ఆ వెన్నెల’ అనే ప్రేమ గీతాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ పాట చాలా బాగుంది. ముఖ్యంగా ఇందులో హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, పాట సాహిత్యం అన్నీ కూడా చాలా బాగున్నాయి. పాట చార్ట్‌బస్టర్ అవుతుందని, అవ్వాలని కోరుకుంటున్నాను. సినిమా కూడా బాగుంటుందని, పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. పాటను గమనిస్తే.. ఈ పాట శ్రోతల్ని ఆకర్షించేలా ఉంది. ఎంఎం కుమార్ బాణీ వినడానికి వినసొంపుగా, హాయిగా ఉంది. శివ సాహిత్యం అందించిన ఈ పాటను మేఘన, మనోజ్ హృదయానికి హత్తుకునేలా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియో హీరోహీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమను చాటి చెప్తోంది. సురేష్ బాల సినిమాటోగ్రపీ, ఉపేంద్ర ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?