Mass Jathara Trailer (Image Source: X)
ఎంటర్‌టైన్మెంట్

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Mass Jathara Trailer: మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఒక లెక్క, ఇప్పుడొచ్చిన ట్రైలర్ ఒక లెక్క అనేలా.. తాజాగా విడుదలైన ట్రైలర్ ఉంది. ఇందులో డైలాగ్స్, యాక్షన్, సాంగ్స్.. ఇలా ప్రేక్షకులకు ఏమేం కావాలో అన్నీ మిక్స్ చేసి.. ట్రైలర్‌ని వదిలారు. ఈ ట్రైలర్ చూస్తుంటే మరో ‘క్రాక్’ తరహా హిట్ మాస్ రాజాకు రాబోతుందనే హైప్‌ని కలగజేస్తోంది. మాస్ మహారాజా రవితేజ, డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల కాంబినేషన్‌లో.. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మాస్ జాతర’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అక్టోబర్ 31 సాయంత్రం ప్రీమియర్స్‌తో థియేటర్ల జాతరకు సిద్ధమవుతున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందంటే..

Also Read- Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ అప్డేట్.. వీడియో వైరల్

ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక..

2 నిమిషాల 31 సెకన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్.. ప్రతి క్షణం చూపుతిప్పుకోనివ్వనంతగా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ‘కేజీ, రెండు కేజీలు కాదురా.. 20 టన్నులు.. ఈ రాత్రికే సరుకు గూడ్స్ ట్రైయిన్‌లో ఎక్కించండి’ అని విలన్ నవీన్ చంద్ర వాయిస్‌తో ట్రైలర్ మొదలైంది. అది మన ఊరు స్టేషన్ మీద నుంచే వెళ్తది కదన్నా.. అక్కడ ఆ రైల్వే ఎస్ఐ ఉంటాడు.. అంటూ రవితేజ పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్‌ని తెలియజేశారు. వెంటనే మాస్ రాజా పవర్ ఫుల్ ఎంట్రీ అదిరింది. ‘ఇన్నాళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడిచింది.. ఇక నుంచి నీ ఆటలు సాగవ్’ అనేలా రవితేజ పాత్ర పేరుని పరిచయం చేశారు. ‘నేను రైల్వే పోలీస్ కాద్.. క్రిమినల్ పోలీస్’ అని రవితేజ డైలాగ్ అనంతరం ఒక్కసారిగా మేడమ్, పిల్లలు రాలేదా సార్ అంటూ ‘విక్రమార్కుడు’ ఫీల్‌లోకి తీసుకెళ్లారు. రవితేజ, శ్రీలల మధ్య లవ్ స్టోరీ.., దేవీప్రియ డైలాగ్, రాజేంద్ర ప్రసాద్ ప్రీ వెడ్డింగ్ షూట్ డైలాగ్, అనంతరం శ్రీలీల అతని పళ్ల గురించి చెప్పే డైలాగ్, రవితేజ జనగణమన పంచ్.. ఇలా సినిమాలోని కామెడీ మోతాదును పరిచయం చేసి.. వెంటనే సీరియస్ మోడ్‌లోకి తీసుకెళ్లారు. రవితేజ, నవీన్ చంద్ర మధ్య వచ్చే ప్రతి సన్నివేశం ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇస్తుందనేలా.. ట్రైలర్‌ తెలియజేస్తుంది. ‘రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్లుంటాయ్.. నేను వచ్చినాక ఒక్కటే జోన్.. వార్ జోన్’ అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తర్వాత ఊచకోతని చూపించారు. మొత్తంగా అయితే మాస్ ట్రీట్ రాబోతుందనే హింట్‌ని ఇవ్వడంలో ట్రైలర్ నూటికి నూరు శాతం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రవితేజకు హిట్ ఆన్ ది వే..

Also Read- Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

మాస్ విందులా ఉంది..

రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేస్తోంది. రవితేజ అంటేనే ఎనర్జీ. ఆ ఎనర్జీకి ‘జాతర’ తోడయితే ఎలా ఉంటుందనేదే ఈ ‘మాస్ జాతర’. అది ట్రైలర్‌లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్‌లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. ముఖ్యంగా హీరో, విలన్ల మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్‌ను రూపొందిన తీరు ఆకట్టుకుంటోంది. కమర్షియల్ హంగులతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ఈ ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన విలన్ పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టబోతున్నాడు. ట్రైలర్‌కు మరింత ఆకర్షణను ఇస్తూ శ్రీలీల అందంగా కనిపించారు. ఆమె మొదటిసారి శ్రీకాకుళం యాసలో మాట్లాడినప్పటికీ, ఆ యాసను పూర్తిగా ఆస్వాదిస్తున్నట్లుగా ఆశ్చర్యపరిచింది. రవితేజ-శ్రీలీల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఈ ట్రైలర్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చింది. మొత్తంగా అయితే అభిమానులకు అసలు సిసలైన జాతర రాబోతుందనే ఫీల్‌ని ఈ ట్రైలర్‌తో మేకర్స్ ఇచ్చేశారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా‌ బస్ యాక్సిడెంట్ మృతులైన తల్లికూతుర్లకు కన్నీటి వీడ్కోలు

Medak: ప్రభుత్వ పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని అందజేసిన హెడ్ మాస్టర్.. ఎక్కడంటే?

Ramchander Rao: రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది.. రౌడీ షీటర్లపై కేసుల ఎత్తేసి ఫించన్లు కూడా ఇస్తారు

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?