fake
క్రైమ్

Jobs: ఉద్యోగాలిస్తామని డబ్బులు వసూలు.. బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

Fraud: గచ్చిబౌలిలో బడా సాఫ్ట్‌వేర్ డెవలపర్ కంపెనీగా పోజు ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచీలు పెట్టారు. ఉద్యోగాలు ఇస్తామని, అయితే డిపాజిట్ ఫీజులు ఇవ్వాలని నిరుద్యోగులకు గాలం వేశారు. ఈ కంపెనీ వ్యవహారాలు, బ్రాంచీలు చూసి కొందరు నిరుద్యోగులు నిజమనే నమ్మారు. డబ్బులు ముట్టజెప్పారు. కోట్ల రూపాయలు వసూలయ్యాక ఆ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామని చల్లగా కబురు చెప్పారు. బాధితులు రాయదుర్గ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రైల్ వరల్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఈ కంపెనీ దేశ వ్యాప్తంగా ఐదు బ్రాంచీలు పెట్టింది. ఇందులో ఒకటి మూడు నెలల క్రితం గచ్చిబౌలిలోనూ పెట్టింది. ఉద్యోగాలు ఇస్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి 40 వేల నుంచి 50 వేల రూపాయలు తీసుకుంది. వీటిని సెక్యూరిటీ డిపాజిట్లుగా చెప్పి నమ్మించింది. ఒక్క గచ్చిబౌలిలోనే రూ. 40 లక్షల వరకు డబ్బు వసూలు చేసింది. మొత్తంగా 800 మంది దగ్గర సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేసింది. మొత్తం రూ. 5 కోట్ల వరకు డబ్బులు వసూలయ్యాక బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామని యాజమాన్యం షాక్ ఇచ్చింది.

కంపెనీ మోసంతో హైదరాబాద్‌లో 100 మంది ఉద్యోగులు నష్టపోయారు. వారు రాయ్‌దుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!