Montha-Cyclone (Image source Twitter)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

CYCLONE MONTHA: మరికొన్ని గంటల్లోనే ‘మొంథా తుపాను’ బీభత్సం.. ఈ ఏరియాల్లో ఉండేవారికి బిగ్ అలర్ట్

CYCLONE MONTHA: తీవ్ర తుపాను ‘మొంథా’ క్రమంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. మంగళవారం సాయంత్రం, లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య, కాకినాడ సమీప ప్రాంతంలో ఇవాళ (మంగళవారం) సాయంత్రం లేదా రాత్రికి తీరం దాటుతుందని భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా అంచనా అప్రమత్తం చేసింది. తీరం దాటే సమయంలో తీవ్ర తుపానుగా మారుతుందని, ఆ సమయంలో గరిష్టంగా 90-100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

Read Also- Jubliee Hills Bypoll: జూబ్లీలో పోలింగ్ పెంచేందుకు కొత్త ప్లాన్.. రంగంలోకి యూసీడీ, స్వయం సహాయక బృందాలు!

మొంథా తుపానుకు సంబంధించిన ప్రధాన వర్షపాత మేఘాలు (Core Bands) రాగల 6 గంటల్లో దివిసీమ నుంచి ఒంగోలు మధ్య ఉన్న సెంట్రల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోకి ప్రవేశిస్తాయని తెలిపింది. ఈ ప్రాంతాలను అతి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని వివరించింది. తుపానుకు సంబంధించిన శక్తివంతమైన మేఘాలు బాపట్ల, మచిలీపట్నం, ఒంగోలు ప్రాంతాలను తాకనున్నట్టు వెల్లడించింది. ఈ మేఘాలు గుంటూరు, విజయవాడ, ఏలూరు, నర్సాపురం, భీమవరం ప్రాంతాలకు కూడా విస్తరించి, వర్ష బీభత్సాన్ని సృష్టిస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనాగా ఉంది. ఖమ్మం, భద్రాద్రి – కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, యాదాద్రి-భువనగిరి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా అక్కడక్కడా చిరు జల్లులు పడే ఛాన్స్ ఉంది. అయితే, మంగళవారం రాత్రి నుంచి వర్షాల తీవ్రత పెరిగి, మోస్తరు వానలు పడే అవకాశం ఉంది.

Read Also- Harish Rao Father Death: హరీశ్ రావు తండ్రి మరణం.. సీఎం రేవంత్ సంతాపం.. పరామర్శించిన కేసీఆర్

తుపాను ప్రభావంతో బుధవారం ఉదయం 8:30 వరకు తీవ్రమైన వర్షాలు పడతాయని అంచనాగా ఉంది. తుపాను ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రతో పాటు పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి ఐ తీవ్రత మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

అప్రమత్తమైన ఏపీ సర్కారు

మొంథా తీవ్రమైన తుపాను కావడంతో ఏపీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఆర్టీజీఎస్ నుంచి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, నారాయణ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉమ్మడి విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరిస్తున్న తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరిపారు.

ఆంధ్రప్రదేశ్, యానాం తీర ప్రాంతాలలో అతి తీవ్రమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రాంతాల్లో 21 సెంటీమీటర్లకుపైగా వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేసింది.ఇక, రాయలసీమ 7-11 సెంటీమీటర్ల వరకు వానలు పడతాయని తెలిపింది. మొంథా తుపానును పక్కన పెడితే రాగల 24 గంటల్లో దేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా జోరు వానలు కురుస్తాయని తెలిపింది. తూర్పు రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో 7-20 సెం.మీ. వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. ఇక, కేరళ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడుల్లో 7-11 సెం.మీ. వరకు భారీ వానలు పడతాయని తెలిపింది.

Just In

01

Thiruveer: ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఎలా ఉంటుందంటే..

Suriya: ఒక కామన్ మ్యాన్‌, కింగ్ సైజ్‌లో కనిపించాలంటే.. రవితేజ తర్వాతే ఎవరైనా?

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?