Trains cancelled: ప్రస్తుతం యావత్ దేశం శీతాకాలంలోకి అడుగుపెట్టింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పతనమవుతున్నాయి. ముఖ్యంగా హిమాలయాలకు ఆనుకొని ఉండే జమ్ముకాశ్మీర్ సహా ఈశాన్య రాష్ట్రాల్లో మంచు ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మున్ముందు రోజుల్లో మంచు తీవ్రత అధికమయ్యే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పట్టాలపై భారీ ఎత్తున మంచు పేరుకుపోయి.. తీవ్ర ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భారతీయ రైల్వే (Indian Railway) సంచలన ప్రకటన చేసింది. రాబోయే హిమపాతాన్ని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఏ ఏ తేదీల్లో రద్దు అంటే..
రైల్వే అధికారుల ప్రకారం.. డిసెంబర్ 1, 2025 నుంచి ఫిబ్రవరి 28, 2026 మధ్య 16 రైళ్లు రద్దయ్యాయి. దట్టమైన మంచు, విజిబిలిటీ తక్కువ ఉండటం వంటి కారణాల రిత్యా ఆ రైళ్లను 3 నెలల పాటు నిలిపివేసినట్లు స్పష్టం చేశారు. రద్దు కాబోయే రైళ్ల జాబితాలో షహరాన్‌పూర్ – దిల్లీ మధ్య నడిచే జలంధర్ – దిల్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా ఉంది. ఈ రైలు 2026 మార్చి 1 వరకు అందుబాటులో ఉండదు.
ప్రత్యామ్నయ ఏర్పాట్లు..
రైళ్ల రద్దుకు సంబంధించి షహరాన్‌పూర్ స్టేషన్ సూపరిండెంట్ ఎ. కె. త్యాగి స్పందించారు. మంచు ప్రభావం వల్ల పలు రైళ్లు రద్దు చేయాలని మార్గదర్శకాలు వచ్చినట్లు చెప్పారు. అయితే ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే వింటర్ సీజన్ లో రద్దు చేయబడ్డ రైళ్ల వివరాలను రైల్వే వర్గాలు ప్రకటించారు. వాటి జాబితా ఇప్పుడు చూద్దాం.
రద్దు చేయబడిన రైళ్లు
❄️ రైలు నెం. 12207 కత్గోడం – జమ్ము ఎక్స్‌ప్రెస్ (Kathgodam–Jammu Express)
❄️ రైలు నెం. 12208 జమ్ము – కత్గోడం ఎక్స్‌ప్రెస్ (Jammu–Kathgodam Express)
❄️ రైలు నెం. 14681 ఢిల్లీ – జలంధర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Delhi – Jalandhar City Superfast Express)
❄️ రైలు నెం. 14682 జలంధర్ – దిల్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (Jalandhar – Delhi Superfast Express)
❄️ రైలు నెం. 12317 అమృతసర్ – కోల్‌కతా అకాల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్ (Amritsar–Kolkata Akal Takht Express)
❄️ రైలు నెం. 12318 కోల్‌కతా – అమృతసర్ అకాల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్ (Kolkata–Amritsar Akal Takht Express)
❄️ రైలు నెం. 12357 అమృతసర్ – కోల్‌కతా దుర్గియానా ఎక్స్‌ప్రెస్ (Amritsar–Kolkata Durgiana Express)
❄️ రైలు నెం. 12358 కోల్‌కతా – అమృతసర్ దుర్గియానా ఎక్స్‌ప్రెస్ (Kolkata–Amritsar Durgiana Express)
❄️ రైలు నెం. 14523 అంబాలా – బరౌనీ ఎక్స్‌ప్రెస్ (Ambala–Barauni Express )
❄️ రైలు నెం. 14524 బరౌనీ – అంబాలా ఎక్స్‌ప్రెస్ (Barauni–Ambala Express)
❄️ రైలు నెం. 14605 జమ్ము – యోగా నగరి ఋషికేశ్ ఎక్స్‌ప్రెస్ (Jammu–Yoga Nagari Rishikesh Express)
❄️ రైలు నెం. 14606 యోగా నగరి ఋషికేశ్ – జమ్ము ఎక్స్‌ప్రెస్ (Yoga Nagari Rishikesh–Jammu Express)
❄️ రైలు నెం. 14615 అమృతసర్ – లాల్ కువాన్ ఎక్స్‌ప్రెస్ (Amritsar–Lal Kuan Express)
❄️ రైలు నెం. 14616 లాల్ కువాన్ – అమృతసర్ ఎక్స్‌ప్రెస్ (Lal Kuan–Amritsar Express)
❄️ రైలు నెం. 14617 అమృతసర్ – పూర్నియా జనసేవా ఎక్స్‌ప్రెస్ Amritsar–Purnea Janseva Express
❄️ రైలు నెం. 14618 పూర్నియా – అమృతసర్ జనసేవా ఎక్స్‌ప్రెస్ (Purnea–Amritsar Janseva Express)
Also Read: Bigg Boss Telugu: కట్టప్పలా వెన్నుపోటు పొడిచారు.. ఫేక్ రిలేషన్స్ పెట్టుకోలేదు.. ప్రోమోలో భరణి వైల్డ్ ఫైర్!
గతంలోనూ ఇంతే..
భారతీయ రైల్వే అకస్మిక ప్రకటన కారణంగా.. ఆ రైళ్లల్లో ప్రయాణించదలిచిన వారు తీవ్రంగా ప్రభావితం కానున్నారు. ఇప్పటికే ఆయా రైళ్లల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారికి ఇది షాకింగ్ న్యూస్ గా చెప్పవచ్చు. అయితే ఏటా మంచు కారణంగా పలు రైళ్లను.. భారతీయ రైల్వే రద్దు చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. మంచు కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం తరుచూ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది.
