Kunamneni Sambasiva Rao (imagecredit:swetcha)
తెలంగాణ

Kunamneni Sambasiva Rao: మోదీ పాలనలో దేశ పరిస్థితి తిరోగమనం: ఎమ్మెల్యే కూనంనేని

Kunamneni Sambasiva Rao: ఎల్ఐసీ(LIC) సొమ్మును కేంద్ర ప్రభుత్వం ఆదానీకి ధారాదత్తం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(MLA Kunamneni Sambasiva Rao) అన్నారు. సోమవారం మగ్దూమ్ భవన్‌లో నిర్వహించిన పార్టీ ప్రజా సంఘల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ, పేదలు ఎల్ఐసీ(LIC)కి రూ.33వేల కోట్లు డిపాజిట్ చేశారన్నారు. అదానీ కంపెనీ సంక్షోభంలో ఉన్నదని ఆదుకోవడం కోసం ఎల్ఐసీ డబ్బులు ఇవ్వడం మోదీ ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానం అర్థం అవుతుందన్నారు.

100ఏళ్ల ప్రస్థానంలో..

మోదీ(Modhi) పరిపాలనతో దేశం తిరోగమనానికి వెళ్లిందని, కేవలం ప్రసంగాలు, మాటలు తప్పితే ప్రజలకు చేసేందేమీ లేదని విమర్శించారు. 100ఏళ్ల ప్రస్థానంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్మించిన పార్టీ సీపీ(CPI)ఐ అని, తెలంగాణ సాయుధ పోరాటం నడిపి రజాకార్లను తరిమికొట్టిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదన్నారు. అధికారం లేకున్నా పేదల పక్షాన నిలబడి వారికోసం, వారి హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. డిసెంబర్ 26న ఖమ్మం(Khammam)లో సీపీఐ జాతీయ శతాబ్ది ఉత్సవాల ముగింపును అట్టహాసంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Also Read: Australia Cricketers: ఇండోర్‌లో షాకింగ్ ఘటన.. ఆసీస్ మహిళా క్రికెటర్లను అసభ్యకరంగా తాకిన ఆకతాయి

ఈ సభ ఓ చారిత్రాత్మక ఘట్టం

ఈ సభ ఓ చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతుందని, ఇందుకోసం ప్రతి ప్రజాసంఘం నడుం బిగించాలని పిలుపునిచ్చారు. సీపీఐ(CPI) పోరాటాలను ఉద్యమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, అన్ని వర్గాల ప్రజలకు పార్టీ చరిత్రను వివరించాలని సూచించారు. కమ్యూనిస్టుల పని అయిపోయిందని అంటున్న వారి నోళ్లు మూతపడేలా ఉత్సాహపూరిత వాతావరణంలో ఈ వేడుక ఉండబోతుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 40 కమ్యూనిస్టు దేశాల ప్రతినిధులు వస్తున్నారని, శతవసంతాల ముగింపు సభ వేదికగా కమ్యూనిస్టు పార్టీ మరింత పురోగమన దిశగా ముందుకు సాగాలని, 5 లక్షల మందితో జరుగే సీపీఐ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

Also Read: Kishan Reddy: జూబ్లీహిల్స్‌లో రౌడీయిజం పెరిగిపోయింది: కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Just In

01

Revanth Reddy: కమ్మ సంఘాల సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Fake VRA: తహసిల్దార్ కార్యాలయంలో ఫేక్ ఉద్యోగి.. ఇతడెవరో?

Chiranjeevi: రవితేజ, వెంకీ, కార్తీ.. చిరంజీవి సేఫ్ గేమ్ ఆడుతున్నారా?

Anu Emmanuel: నేషనల్ క్రష్‌నే నమ్ముకున్న అను ఇమ్మాన్యుయేల్.. రీ ఎంట్రీ కలిసొస్తుందా?

Medak district: నర్సాపూర్ అటవీ.. ఏకో పార్కు ప్రాంతాన్ని పరిశీలించిన : కలెక్టర్ రాహుల్ రాజ్