Disability Empowerment: దివ్యాంగులకు గుడ్ న్యూస్..!
Disability Empowerment (imagecredit:twitter)
Telangana News

Disability Empowerment: దివ్యాంగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం..!

Disability Empowerment: దివ్యాంగుల ఆర్థిక స్వావలంబన కోసం ప్రజా ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక స్వయం సహాయక సంఘాలను (ASJG) ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఎస్​హెచ్​జీల ఏర్పాటు, నిర్వహణ ఈ బాధ్యతలను ప్రభుత్వం సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ)కు అప్పగించింది. త్వరలో సీఎం రేవంత్​ రెడ్డి(Revanth Reddy) చేతుల మీదుగా సంఘాలను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. సెర్ప్ సంస్థ ఇప్పటికే క్షేత్రస్థాయి అధ్యయనం చేసి, ప్రత్యేక అధికారులను నియమించింది. త్వరలో దివ్యాంగుల సంఘాల ఖాతాల్లో రివాల్వింగ్ ఫండ్ జమ చేయ‌నున్నారు. దీంతో పాటు మ‌హిళా సంఘాల త‌ర‌హాలోనే దివ్యాంగ సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నది.

ఇప్పటికే 50 వేల మందికి పైగా గుర్తింపు..

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అర్హులైన 50 వేల మందికి పైగా దివ్యాంగులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 4,800 సంఘాలను ఏర్పాటు చేసి సభ్యులుగా చేర్పించాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. గ్రామాల్లో మహిళ సమాఖ్యల ద్వారా దివ్యాంగుల సమాచారాన్ని ఇంకా సేకరిస్తున్నారు. వీలైనంత మేరకు అర్హులను గుర్తించిన తర్వాత దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలను అధికారికంగా ప్రకటించనున్నారు. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల్లో మహిళలతోపాటు పురుషులు కూడా సభ్యులుగా చేరేందుకు అవకాశం కల్పించారు. అయితే, మహిళా సాధికారతను దృష్టిలో ఉంచుకుని సంఘాల్లో అధ్యక్షులుగా మహిళలే ఉండేలా నిబంధనలు రూపొందించారు. దీని ద్వారా మహిళా దివ్యాంగుల నాయకత్వాన్ని ప్రోత్సహించడంతో పాటు నిర్ణయాధికారంలో వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారు. దివ్యాంగులలో ఉన్న ఒంటరితనాన్ని తొలగించి, వారిని సమాజంలో భాగస్వామ్యులుగా నిలబెట్టి, ఆర్థికంగా బలోపేతం చేయడం ప్రధాన లక్ష్యంగా ఈ స్వయం సహాయక సంఘాలు రూపుదిద్దుకుంటున్నాయి.

Also Read: Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

ప్రతిఏటా రూ.25 వేల కోట్లు..

ఈ సంఘాల ద్వారా సభ్యులు చిన్నతరహా వ్యాపారాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణలు పొందే అవకాశాలు కల్పిస్తారు. బ్యాంకు లింకేజీతో రుణ సదుపాయాలు, ఆదాయ వృద్ధికి తోడ్పడే ఆర్థిక సహకారం కూడా అందిస్తారు. దివ్యాంగుల నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన, బ్యాంకు లింకేజ్ ద్వారా ఆర్థిక స్వావలంబన సాధన వంటి అంశాలపై దివ్యాంగుల స్వయం స‌హాయ‌క సంఘాలు దృష్టి సారించనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్​) కార్యక్రమం ద్వారా మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. ప్రతిఏటా రూ.25 వేల కోట్లకు పైగా బ్యాంకు రుణాలు పొందుతున్న ఈ సంఘాలు, సకాలంలో వడ్డీలు చెల్లిస్తూ ఆర్థిక క్రమశిక్షణకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రమాద బీమా, లోన్ బీమా వంటి పథకాలతోపాటు మహిళలకు ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందిస్తున్నది. దీంతో మహిళలు ఇప్పుడు సోలార్ పవర్ ప్లాంట్లు, ఆర్టీసీ అద్దె బస్సులు, పెట్రోల్ బంకుల నిర్వహణ వంటి వినూత్న వ్యాపారాల్లో ముందంజ వేస్తున్నారు. దివ్యాంగుల స్వయం సహాయక సంఘాల ఏర్పాటు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తేదీని ప్రకటించబ

దివ్యాంగుల‌ ఆర్థిక సాధికార‌తే ల‌క్ష్యం : మంత్రి సీత‌క్క

రాష్ట్రంలో దివ్యాంగుల ఎస్​హెచ్​జీల ద్వారా దివ్యాంగులు కూడా ఇతరుల మాదిరిగా ఆర్థికంగా ఎదిగి, సమాజంలో గౌరవప్రదమైన స్థానానికి ఎదుగుతారు. దివ్యాంగులు సొంత ప్రతిభ, కృషి, పట్టుదలతో జీవితాన్ని నిర్మించుకునే దిశగా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటవుతున్న దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, స్వయం ఉపాధి అవకాశాల క‌ల్పనకు వేదిక‌ల‌వుతాయి. వారికి సమాన అవకాశాలు కల్పించే సమానత్వ దృక్పథంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.

Also Read: Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

Just In

01

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?