Kantara Chapter 1 OTT: చారిత్రక యాక్షన్ థ్రిల్లర్ ‘కాంతార: ఏ లెజెండ్ చాప్టర్ 1’ (Kantara: A Legend Chapter 1) కోసం సినీ ప్రియుల ఎదురుచూపులు ముగిశాయి. బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ మైథలాజికల్ చిత్రం, ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ, స్ట్రీమింగ్ డిటైల్స్‌ని అధికారికంగా ప్రకటించింది. ఆ వివరాల్లోకి వెళితే..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
రిషబ్ శెట్టి (Rishab Shetty) రాసి, దర్శకత్వం వహించి, ప్రధాన పాత్ర పోషించిన ఈ బ్లాక్‌బస్టర్ చిత్రం ఎక్స్‌క్లూజివ్ గ్లోబల్ స్ట్రీమింగ్ ప్రీమియర్‌ను ప్రైమ్ వీడియో సోమవారం (అక్టోబర్ 27, 2025) ప్రకటించింది. ఈ సినిమా 31 అక్టోబర్, 2025 నుంచి ప్రైమ్ మెంబర్స్ ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 200 పైగా దేశాలలో చూసేందుకు అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ చిత్రం కన్నడ భాషతో పాటు, తమిళం, తెలుగు, మలయాళం డబ్బింగ్ వెర్షన్లలో అందుబాటులో ఉంటుంది. 2022లో సంచలనం సృష్టించిన ‘కాంతార – ఏ లెజెండ్’ (Kantara – A Legend) చిత్రానికి ఇది ప్రీక్వెల్ అనే విషయం తెలిసిందే. హోంబాలే ఫిల్మ్స్ (Hombale Films) నిర్మించిన ఈ చిత్రంలో రిషబ్ శెట్టితో పాటు రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
Also Read- Megastar Chiranjeevi: చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలు వైరల్.. సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు!
కథ విషయానికి వస్తే..
కదంబ రాజవంశం కాలంలో సాగే ఈ కథ, పంజుర్లి దైవం పుట్టుక, దాని వెనుక ఉన్న పురాణ నేపథ్యాన్ని వివరిస్తుంది. కాంతార పవిత్ర అడవులను కాపాడే దైవంగా పంజుర్లి దైవం, అన్యాయాన్ని అంతం చేసే గుళిగా దైవం పాత్రల చుట్టూ కథని అల్లుకున్నారు. అధికారం, దురాశ ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నించినప్పుడు, దైవ శక్తులు మేల్కొని ధర్మాన్ని నిలబెట్టడం ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. ఈ చిత్రం భక్తి, ప్రతీకారంతో పాటు మనుగడ యొక్క శక్తివంతమైన గాథగా నిలుస్తుంది.
సినీ ప్రపంచానికి కొత్త అధ్యాయం: రిషబ్ శెట్టి
‘కాంతార’ చిత్ర కథాంశంపై దర్శకుడు, నటుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) మాట్లాడుతూ.. ఈ కథ మన మట్టిలో లోతుగా పాతుకుపోయి, మానవుడు, ప్రకృతి, విశ్వాసం మధ్య ఉన్న పవిత్ర బంధాన్ని ఆచరిస్తుంది. ఈ ప్రీక్వెల్‌పై పనిచేయడం మొదలుపెట్టినప్పుడు, ఈ ప్రపంచానికి ప్రేరణగా నిలిచిన మూలాలకు తిరిగి వెళ్లాలని కోరుకున్నాను. ఇందులో ప్రతి ఆచారం, భావోద్వేగం, నిజమైన సంస్కృతి, సంప్రదాయాల నుండి తీసుకున్నవేనని తెలిపారు. ప్రైమ్ వీడియో ఇండియా కంటెంట్ లైసెన్సింగ్ డైరెక్టర్ మనీష్ మెన్ఘాని మాట్లాడుతూ.. స్థానిక సంస్కృతి, ప్రామాణికతతో కూడిన కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించగలవని ‘కాంతార’ నిరూపించింది. ఈ అసాధారణ చిత్రాన్ని అక్టోబర్ 31 నుంచి మా గ్లోబల్ ప్రైమ్ వీడియో వీక్షకులతో పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నామని అన్నారు.
get ready to witness the LEGENDary adventure of BERME 🔥#KantaraALegendChapter1OnPrime, October 31@hombalefilms @KantaraFilm @shetty_rishab @VKiragandur @ChaluveG @rukminitweets @gulshandevaiah #ArvindKashyap @AJANEESHB @HombaleGroup pic.twitter.com/ZnYz3uBIQ2
— prime video IN (@PrimeVideoIN) October 27, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
