MLC Kavitha (imagecredit:twitter)
Politics

MLC Kavitha: త్వరలో వారి చిట్టా బయటపెడతా అంటూ.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha: తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(MLC Kavitha) చేపట్టిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమం సందర్భంగా నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)తో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఒకవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, మరోవైపు అర్వింద్ ఆమెపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ‘జనం బాట’ లక్ష్యాలను స్పష్టంగా కవిత వివరించారు. ‘అవకాశం, అధికారం, ఆత్మగౌరవం మా విధానం’ అని ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధన ద్వారానే ఈ లక్ష్యాలు నెరవేరుతాయని ఉద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆగిపోవడం వల్ల ఆడబిడ్డలకు విద్య అందకుండా పోతోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, యువత, మహిళలకు కీలక నిర్ణయాలు తీసుకునే అధికారంలో వాటా లేదని, మహిళల భాగస్వామ్యం 5% కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన విషయంలో బీఆర్ఎస్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, బాధ్యతను మరిచిన మోసపూరిత వ్యక్తులదే పై చేయి అయ్యిందన్నారు. వారి కారణంగానే బీఆర్‌ఎస్, కేసీఆర్‌కు నష్టం జరుగుతోందన్నారు. నిజామాబాద్‌లో తన ఓటమికి ఎమ్మెల్యేలే కారణమని మరోసారి స్పష్టం చేశారు. పార్టీ పెట్టడం పెద్ద పని కాదని, కానీ ప్రజల సమస్యలు తీర్చడమే ముఖ్యమని కవిత అన్నారు. కేసీఆర్ తనతో పార్టీ పెట్టించే అవసరం లేదని, అలాంటిది ఉంటే ఆయనే చెబుతారని ఊహాగానాలకు తెరదించారు.

రాజీనామా చేయండి!

ధర్మపురి అర్వింద్‌ను లక్ష్యంగా చేసుకొని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘నిజామాబాద్‌లో బీజేపీ ఎంపీ ఉన్నా లేనట్టే. గతంలో కే ట్యాక్స్ నడుస్తోందని ఆరోపించారు. మరి ఇప్పుడేం నడుస్తోంది? మీ ట్యాక్స్ నడుస్తున్నదా? గతంలో మాధవ నగర్ బ్రిడ్జి గురించి చాలా మాట్లాడారు. ఎంపీకి చిత్తశుద్ధి ఉంటే సీఎం రేవంత్ రెడ్డి లేదా మోదీతో మాట్లాడి బ్రిడ్జి పనులు పూర్తి చేయించాలి. బీసీలకు రిజర్వేషన్ బిల్లు విషయంలో అర్వింద్ రాజీనామా చేయండి. అప్పుడు బిల్లు నడుచుకుంటూ వస్తుంది. మీరు బీసీలకు ఆరాధ్య దైవంగా మిగిలిపోతారు. కేంద్రంలో మోదీ సర్కార్ మైనార్టీలో ఉంది. మీరు రాజీనామా చేస్తే బిల్లు కచ్చితంగా అవుతుంది. నేను జనం బాటకు వస్తున్నానని తెలిసి మరో బీజేపీ ఎంపీ నా గురించి ఇష్టానుసారంగా మాట్లాడారు. ఆయన అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే చిట్టా రూపంలో బయటపెడతాను’ అని కవిత సంచలనం సృష్టించారు. అనంతరం రౌడీషీటర్ దాడిలో మరణించిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అదే దాడిలో గాయపడిన ఆసిఫ్‌ను కూడా పరామర్శించి, రియాజ్‌ను పట్టుకోవడంలో ఆయన చూపించిన ధైర్యసాహసాలను అభినందించారు.

Also Read: Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

400 ఓట్లు రావు..

కవిత వ్యాఖ్యలపై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘రాష్ట్రమంతటా తిరిగినా కల్వకుంట్ల కవితకు 400 ఓట్లు కూడా రావు. నాలుగేళ్లు కాదు కదా.. నాలుగు జన్మలెత్తినా ప్రజలు కవితకు ఓట్లు వేయరు. బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యమకారులకు ఎందుకు న్యాయం చేయలేదో ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ను కవిత అడగాలి. కేసీఆర్, కేటీఆర్, కవిత అక్రమంగా సంపాదించిన కోట్లాది రూపాయలు తీసుకువచ్చి అమరవీరుల కుటుంబాలకు ఇచ్చి న్యాయం చేయాలి. కేసీఆర్ ఫోటో లేకుండా కవితను ఎవరూ పట్టించుకోరు. ఆ ఫోటోతోనే ఆమె జీవితంలో ఒక్కసారి ఎంపీ అయ్యారు’ అని అర్వింద్ ఘాటు విమర్శలు చేశారు. ‘జూబ్లీహిల్స్‌లో బీజేపీ పరిస్థితి ఏంటనేది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని అడగాలి. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్ని బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందనేది నేను చెప్పగలను కానీ, జూబ్లీహిల్స్ నేనెలా చెప్పగలను’ అని ఎంపీ చెప్పారు.

Also Read: Adivasi Protest: లంబాడీలకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు

Just In

01

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ