KTR (imagecredit:twitter)
Politics

KTR: తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: కేటీఆర్

KTR: తెలంగాణలో ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తోందని బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సంచలన ఆరోపణ చేశారు. సీఎం రేవంత్ రెడ్(CM Revanth Reddy)డి బీజేపీతో కలిసి పని చేస్తున్నారని, దీనిపై కాంగ్రెస్(Congress) అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన సమావేశంలో కేటీఆర్(KTR) మాట్లాడుతూ, తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.

మోదీని రేవంత్ ఆదర్శంగా

మైనార్టీ ప్రాతినిథ్యం లేని మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ(Telangana)లోనే ఏర్పడిందని, ఈ విషయంపై రాహుల్ స్పష్టత ఇవ్వాలని కోరారు. ‘తెలంగాణలో రేవంత్, బీజేపీ కలిసి పనిచేస్తున్నారు. ఇక్కడి కాంగ్రెస్ నేతలు అంతా బీజేపీతో కలిసిపోయారు. బీజేపీ ఎంపీలకు పిలిచి మరీ కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టులు ఇస్తున్నది. బలమైన ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్(Congress), బీజేపీ(BJP)లు కలిసి బీ టీం అంటున్నాయి. ఇతర రాష్ట్రాలలో బుల్డోజర్ పాలనను విమర్శించే రాహుల్‌కు, తెలంగాణలో నడుస్తున్న బుల్డోజర్ రాజ్యం కనిపించడం లేదా? ప్రధాని మోదీని రేవంత్ ఆదర్శంగా తీసుకుంటున్నప్పటికీ, రాహుల్ ఎందుకు మౌనంగా ఉంటారా?’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Also Read: Chiranjeevi: పేరు, ఫొటోల విషయంలో చిరంజీవి తీసుకున్న నిర్ణయానికి కారణం బాలయ్యేనా?

అలీబాబా దొంగల ముఠా!

‘కాంగ్రెస్ వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Amendment Bill) చట్టంగా మారిన వెంటనే, బీజేపీ పాలిత రాష్ట్రాల కన్నా ముందే దాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం తెలంగాణ(Telangana). అడ్డగోలు హామీలు, మాయమాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని జూబ్లీహిల్స్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అలీబాబా దొంగల ముఠాలా తయారైంది. రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలనగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్‌ఆర్(ORR) లోపల కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదు. రెండేళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుంది. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతోనే వచ్చింది. తెలంగాణకు లాభం చేసే తీర్పు ఇవ్వాలి’ అని ప్రజలను కేటీఆర్ కోరారు.

Also Read: Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Just In

01

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Chiranjeeva Trailer: రాజ్ తరుణ్ ‘చిరంజీవ’ ట్రైలర్ ఎలా ఉందంటే..

Huzurabad: హుజూరాబాద్‌లో కాంగ్రెస్ నేత సుడిగాలి పర్యటన.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ