School Holidays: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఇది నేడు తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ(Meteorological Department) అంచనా వేసింది. సాయంత్రానికి తీరాన్ని దాటుతుందని, దాని ప్రభావంతో ఆంధ్ ప్రదేశ్(AP) తెలంగాణ(Telangana)లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అందుకుగాను ఈ నెల 30వ తేదీ వరకు రెయిన్ అలర్ట్ ప్రకటించారు. ఆంద్రప్రదేశ్ లో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. కళింగ పట్నం(Kalingapatnam) నుండి మచిలీపట్నం మధ్య కాకినాడ(Kakinada) సమీపంలో తీరం దాటనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఓ పక్క మోంథా తుఫాన్ తీవ్ర రూపం దాల్చనుండటంతో దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది.
నేటి నుండి మరో మూడు రోజుల పాటు
ఆగ్నేయ బంగాళ కాతంలో ఎర్పడిన వాయుగుండం క్రమ క్రమంగా మరింత బలపడే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపారు. రానున్న మరికొన్ని గంటల్లో తీవ్ర రూపం దాల్చి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందుకుగాను నేటి నుండి మరో మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని కోన్ని జిల్లాలో స్కూళ్లకు(School) సెలవులు ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతాల్లొ ఎవరు కూడా అటువైపు వెల్లవద్దని అక్కడి అధికారులు హెచ్రరిలకు జారీ చేశారు. శ్రీకాకుళం, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లీ, పార్వతీపురం, ఎలూరు, తూర్పూగోదావరి, తిరుపతి జిల్లాలో భరీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!
తెలంగాణలోను..
అటు తెలంగాణలోను భారీ వర్షాల పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Also Read: Street Dog Attacks: వీధి కుక్కల స్వైర విహారం.. ఎంతదారుణం!
