Wine Shop Lottery: వచ్చే రెండేళ్ల కాలానికి వైన్ షాపు(Wine Shop)లను కేటాయించేందుకు నేడు లక్కీ డ్రా(Lucky draw) నిర్వహించనున్నారు. ఇందుకోసం ఎక్సైజ్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించి దరఖాస్తులు చేసుకున్నవారు ఎవరికి షాపులు దక్కుతాయోనని టెన్షన్ పడుతున్నారు. లాటరీలో తమకే షాపు దక్కాలని కోరుకుంటూ ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు పూజలు చేస్తున్నారు. ఇష్ట దైవాలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.
త్వరలోనే ముగియనున్న గడువు..
రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 వైన్ షాపులు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నడుస్తున్న షాపుల లైసెన్స్(License) గడువు త్వరలోనే ముగియనున్నది. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారులు(Excise officersz) ఇటీవల వైన్ షాపులను కేటాయించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆసక్తి ఉన్నవారు. దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో 2,620 షాపులకు గాను 95,137 దరఖాస్తులు వచ్చాయి. ముందుగా నిర్ణయించినట్టుగా సోమవారం వైన్ షాపులను కేటాయించేందుకు ఆయా జిల్లాల కలెక్టర్లు ఉదయం 11 గంటల నుంచి డ్రా నిర్వహించనున్నారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!
హైకోర్టులో పిటిషన్లు
కాగా, వైన్ షాపుల కోసం దరఖాస్తుల గడువును పెంచుతూ కొంతమంది హైకోర్టు(High Cort)లో పిటిషన్లు వేసిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ చేపట్టిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే, వైన్ షాపు(Wine Shop)లను కేటాయించేందుకు డ్రా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. దాంతో ప్రొహిబిషన్(Prohibition), ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్(Excise Commissioner Harikiran) ఆయా జిల్లాల్లో డ్రా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయించారు.
Also Read: Adivasi Protest: లంబాడీలకు వ్యతిరేకంగా ఆదివాసీల ఆందోళన.. అడ్డుకున్న పోలీసులు
